వైరల్ : అచ్చం మనిషిలాగే.. ఊపిరి పీల్చుకుంటున్న భూమి?

praveen
మనుషుల దగ్గర నుంచి జంతువులు, పక్షులు ఇలా భూమ్మీద ఉన్న అన్ని జీవరాసులు కూడా అటు ఊపిరి పీల్చు కుంటాయి అన్న విషయం అందరికీ తెలుసు. ఇక అటు మనకు ఆక్సిజన్ పంచే చెట్లు సైతం కార్బన్డయాక్సైడ్ ను పీల్చుకొని బ్రతుకుతాయి అన్న విషయం కూడా ఇప్పటికే శాస్త్రవేత్తలు నిరూపించారు. అయితే చెట్లు ఊపిరి పీల్చుకోవడం కనిపించక పోయినప్పటికీ అవి ఊపిరి పీల్చుకుంటాయి అన్న విషయం మాత్రం అందరికీ తెలుసు. కానీ భూమి ఊపిరి పీల్చుకుంటుంది అంటే ఎవరైనా నమ్ముతారా..

 భూమి ఊపిరి పీల్చు కోవడం అనే విషయం ఇప్పటి వరకు ఎవరు కూడా కలలో కూడా విని ఉండరు. ఇక ఇలాంటి విషయం గురించి వినడానికి కాస్త ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. కానీ ఇక్కడ భూమి ఊపిరి పీల్చుకోవడం కి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సాధారణంగానే ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. ఇలాంటి వింతలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి. ఇక ఇప్పుడు భూమి ఊపిరి పీల్చుకోవడానికి సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా ప్రత్యక్షమైంది అని చెప్పాలి.

 ఎంతో పచ్చటి చెట్ల మధ్య ఇక ఇలాంటి ఘటన జరిగింది అని చెప్పాలి. ఈ చెట్ల మధ్య ఒక నిర్దిష్ట భూభాగం మాత్రమే పైకి లేచి మరల సాధారణ స్థితికి చేరుకుంటుంది. అచ్చం ఒక మనిషి గుండె ఊపిరి పీల్చుకున్నప్పుడు ఊపిరి వదిలినప్పుడు ఎలా అయితే స్పందిస్తూ ఉంటుందో.. ఇక ఇప్పుడు భూమి కూడా అలాగే స్పందిస్తూ ఉంది అని చెప్పాలి. ఇలా మనిషి ఊపిరి పీల్చుకున్నట్లుగానే అటు భూమి కూడా ఊపిరి పీల్చుకుంటుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది కేవలం గ్రాఫిక్స్ సంబంధించిన వీడియో అని కొంతమంది అంటుంటే.. ఇలా ఎలా జరిగిందబ్బా అని కొంతమంది తలపిక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: