శ్రీరామనవమి రోజున చేయవలసిన...చేయకూడని పనులు ఇవే..!!

Divya
ప్రతి ఒక్కరు శ్రీరామనమీ పండుగను హిందువులు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు.. ఈరోజు హిందువులకు చాలా ప్రాముఖ్యతమైన రోజు మానవజాతి ఎలా బ్రతకాలో రాముడి అవతారం ఎత్తి నేర్పించారు.. అందుకే ఈ రోజున శ్రీరామనవమి రోజుగా జరుపుకుంటూ ఉంటారు.రాముడు పుట్టి 14 సంవత్సరాలు వనవాసం తర్వాత పట్టాభిషేకం జరిగి ఆ తర్వాత శ్రీరాముని పెళ్లిరోజు కూడా ఈ రోజునే అని మన పురాణాలలో తెలియజేస్తూ ఉంటాయి. హిందువులు అందరూ కూడా ఈ పండుగలు చాలా సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు ఒకసారి తెలుసుకుందాం.

శ్రీరామనవమి ఈ రోజున గురువారం వచ్చింది. ఈరోజు ఉదయం సూర్యోదయంతో లేచి ఇంటిని ప్రతి ఒక్కరు శుభ్రం చేసుకోవాలి అలాగే తలస్నానం చేసి ఇంటి బయట ముగ్గు వేసి శ్రీరాముని పట్టాభిషేకం చిత్రపటాన్ని పూజకు సిద్ధం ఉండేలా చూసుకోవాలి.. ఆరోజు ఆరోగ్య రీత్యా సమస్యలు లేని వారు ఉపవాసం అంటే చాలా మంచిది. పూజకు కావలసిన ఎలాంటి వస్తువులైన  సరే సిద్ధం చేసుకోవాలి.. ప్రసాదాలలో వడపప్పు, పానకం చాలా ముఖ్యం వీటితోపాటు పులిహోర, పరమాన్నం, బూరెలు నైవేద్యంగా పెట్టి పూజ చేయడం మంచిది. అంతేకాకుండా ఇంట్లో శ్రీరామ కళ్యాణం చేయిస్తే చాలా మంచిది. శ్రీరాముని అక్షింతలు తలపై పెళ్లి కాని వారు వేసుకుంటే త్వరగా వివాహం జరుగుతుంది.. ముఖ్యంగా ఈ రోజు అన్నదానం పెట్టించడం చాలా మంచిది.ఈ రోజున ఈ పనులు చేస్తే మంచిది.
..శ్రీరామనవమి రోజున మాంసాహారం అసలు తినకూడదు ముఖ్యంగా ఎలాంటి అబద్ధాలు కూడా చెప్పకూడదు.. తల్లితండ్రుల మాటలకు విలువ ఇవ్వడం భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరు చాలా నమ్మకంతో ఉండడం సోదర పట్ల వ్యత్యాసం చూపించకుండా ఉండడం అలాగే మనకంటే చిన్నవాళ్లను ప్రేమగా పలకరించడం ఇలా కనీసం ఈరోజు అయినా ఉంటే చాలా మంచిదని పండితులు తెలియజేస్తున్నారు. అందుకే శ్రీరామనవమి రోజు ఈ పనులు చేయకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: