వైరల్ : తల్లి ప్రేమ ముందు సింహం కూడా తలవంచాల్సిందే?

praveen
తల్లి ప్రేమ వెలకట్టలేనిది అన్న విషయం తెలిసిందే. నవ మాసాలు మోసి పిల్లలను కనడమే కాదు ఏకంగా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం కూడా చేస్తూ ఉంటుంది తల్లి. అయితే ఇక తమ పిల్లలకు ఏదైనా అపాయం కలుగుతుంది అని భావిస్తే ఏకంగా ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక తన ప్రాణాలను పణంగా పెట్టి మరి పిల్లలను రక్షిస్తూ ఉంటుంది. అయితే కేవలం మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా తల్లి ప్రేమ ఇంతే గొప్పగా ఉంటుంది. ఏకంగా సాధు జంతువులు సైతం పిల్లలను కాపాడుకునేందుకు క్రూర మృగాలతో పోరాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

 అంతే కాదు తల్లి ప్రేమ ఎంత గొప్పది అన్న విషయాన్ని నిరూపించే వీడియోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి వీడియోలు చూసినప్పుడు తల్లిని మించిన యోధులు ఈ లోకంలో ఇంకెవరూ లేరు అనే కేజిఎఫ్ డైలాగ్ కూడా ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సింహాలు ఎక్కువగా జిరాఫీ పిల్లలను టార్గెట్ చేసుకుంటూ ఇక పంజా విసిరి వేటాడటం మొదలు పెడుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక్కడ ఒక సింహం ఇలాంటిదే చేయాలని అనుకుంది.

 పొదల చాటున నక్కి నక్కి ఉన్న ఆ సింహం ఒక్కసారిగా ఒక జిరాఫీ పిల్ల మీద దాడి చేసింది. ఏకంగా మెడను గట్టిగా తన నోటితో పట్టుకుంది. ఇక తప్పించుకోవడానికి ఆ జిరాఫీ పిల్ల ఎంత ప్రయత్నించిన ఉపయోగం లేకుండా పోయింది అని చెప్పాలి. దీంతో ఇక దాని భాషలో అమ్మ అమ్మ అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. దూరంగా జిరాఫీ తల్లి ఆపదలో ఉన్న తన పిల్లను కాపాడేందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడ ఉన్నది ప్రాణాలు తీసే సింహం అని తెలిసినప్పటికీ ఇక బిడ్డ ప్రాణం కాపాడడమే లక్ష్యంగా సింహం పై దాడికి పాల్పడింది. దీంతో తల్లి ప్రేమ ముందు సింహం కూడా తలవంచి అక్కడ నుంచి పారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: