వైరల్ : లైవ్ మ్యూజిక్ షో.. పాట పాడుతూ కుప్పకూలిన సింగర్?

praveen
అసలేం జరుగుతుంది.. మనుషులు చూస్తుండగానే పిట్టల్లా రాలిపోతున్నారు ఎందుకు.. మొన్నటి వరకు ఇలాంటిది ఎక్కడా కనిపించలేదే.. ఇప్పుడే వరుసగా ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి... అసలు ఏ కారణంతో ఇలా సడన్ హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. ఇక ప్రతి ఒక్కరి మనసులో ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతూ ఉన్నాయి అని చెప్పాలి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న సడన్ హార్ట్ ఎటాక్ లకు సంబంధించిన ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అనుక్షణం భయపడుతూనే ఉన్నారు. ఇక ఈ ఘటనలు చూసిన తర్వాత ఆరోగ్యం గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న..  ప్రతిరోజు గంటల తరబడి వ్యాయామం చేసిన.. పౌష్టికాహారాన్ని తీసుకున్న కూడా బతుకుతామన్న గ్యారెంటీ లేదు అన్నది అందరికీ అర్థమవుతుంది.

 ఎందుకంటే ఇక ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే డాక్టర్ల దగ్గర నుంచి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ  స్పెషల్ కేర్ తీసుకునే యాక్టర్ ల వరకు ప్రతి ఒక్కరు కూడా సడన్ హార్ట్ ఎటాక్లతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో ఏదో ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. దక్షిణాఫ్రికాకు చెందిన యువ ర్యాపర్ సాంగ్ రైటర్ అయిన కోస్టార్ టీచ్ లైవ్ మ్యూజిక్ షో చేస్తూనే స్టేజి మీద  నుండి కుప్పకూలిపోయాడు. అయితే కేవలం సెకండ్ల వ్యవధిలోనే రెండుసార్లు కింద పడిపోయాడు.

 అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు అన్న విషయాన్ని డాక్టర్లు తెలిపారు. ఇక ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులు ధ్రువకరించారు అని చెప్పాలి. 27 ఏళ్లకే అతను చనిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత చిన్న వయసులోనే కోస్టా టీచ్ చనిపోవడం మా కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది అంటూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు అని చెప్పాలి. అల్ట్రా సౌత్ ఆఫ్రికా మ్యూజిక్ ఫెస్టివల్లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ యువర్ ర్యాపర్. ఎంతో జోరుగా పాట పాడుతున్న సమయంలోనే ఇలా కుప్పకూలిపోయాడు అని చెప్పాలి. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: