ఖడ్గ మృగాన్ని గెలికితే ఇలాగే ఉంటుంది.. వ్యాన్ బోల్తా?

praveen
ప్రతి జీవికి ఒక పర్సనల్ జోన్ అనేది ఒకటి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అది మనుషులైనా జంతువులైన పక్షులైన కూడా ఇలా పర్సనల్ జోన్ అనేది ఒకటి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో మనుషులు పర్సనల్ లైఫ్ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ.. ఇక జంతువులు, పక్షుల పర్సనల్ జోన్ లోకి వెళ్లి కాస్త అతిగా ప్రవర్తిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎంతోమంది టూరిస్టులు సఫారీల్లో వెళ్లి జంతువులను దగ్గర నుంచి ఫోటోలు తీయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.

 ఇక కొన్ని కొన్ని సార్లు కాస్త అతిగా కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా సఫారీల్లోకి వెళ్లి ఫోటోలు తీస్తున్న టూరిస్టులపై ఇటీవల కాలంలో ఎన్నో రకాల జంతువులు దాడులకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. సఫారీలోకి వెళ్లి జంతువులను ఫోటోలు తీయాలి అనుకున్న టూరిస్టులకు చేదు అనుభవం ఎదురయింది. ఎందుకంటే వాళ్లు అనుకున్నది ఒక్కటి అక్కడ జరిగింది ఒకటి. పూర్తిగా కథ అడ్డం తిరిగింది అని చెప్పాలి. ఏకంగా ఒక భారీ ఖడ్గమృగం వారి వాహనం వైపు దూసుకు వచ్చింది. దీంతో ఆ ఖడ్గం మృగం నుంచి తప్పించుకునేందుకు వాహనాన్ని రివర్స్ లో డ్రైవింగ్ చేయగా చివరికి ఆ వాహనం ఒకచోట బోల్తా పడింది.

 సఫారీ వ్యాన్ పై అడవుల్లో జంతువులను దగ్గర నుంచి ఫోటో తీయడానికి వెళుతున్న టూరిస్టులకు ఖడ్గ మృగాల గుంపు ఎదురయింది. అయినప్పటికీ కాసేపు భయపడకుండా వాహనాన్ని అక్కడ ఆపి ఫోటోలు తీశారు. అయితే ఖడ్గం మృగాలు వారిని చూసి ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాయి. దీంతో వారి మీదికి దూసుకు వచ్చాయ్. ఇది గమనించిన డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని వెనక్కి పోనిచ్చాడు. కానీ అప్పటికే ఒక ఖడ్గమృగం దూసుకొచ్చి వ్యాన్ ను కొమ్ముతో ఢీ కొట్టింది. దీంతో అదుపు తప్పిన వాహనం పల్టీలు కొట్టి పడిపోయింది. ఇక ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: