ఆ రైతు 512 కిలోల ఉల్లిగడ్డలు అమ్మితే రూ.2/- వచ్చాయి?

Purushottham Vinay
రాజేంద్ర తుకారాం చవాన్ అనే ఓ 58 సంవత్సరాల రైతు బాధ తెలిస్తే గుండె బరువెక్కిపోతుంది. ఆ రైతు ఉల్లి పంట పండించాడు. ఏకంగా 70 కిలోమీటర్లు ఆ ఉల్లి పంటను లోడ్ చేసుకుని తీసుకెళ్లాడు.  ఏకంగా 512 కిలోల ఉల్లిగడ్డలను అక్కడ వ్యవసాయ మార్కెట్‌లో అమ్మేశాడు.అయితే ఆ మొత్తం ఉల్లిపాయలు అమ్మగా అతనికి వచ్చిన డబ్బులు చూస్తే ఎవరైనా సరే ఖచ్చితంగా షాక్ తింటారు. అన్ని రుసుములు కట్ చేసుకున్నాక ఆ సాగు మార్కెట్ పాపం అతనికి రూ. 2 చెక్ మాత్రమే చేతిలో పెట్టింది.కిలో ఉల్లిగడ్డలను పాపం రూ. 1 చొప్పున అమ్మాల్సి వచ్చింది. బాధ పడుతూ ఆ రైతు ఇలా అన్నాడు..'నాకు కిలో ఉల్లిగడ్డలకు ఒక్క రూపాయి చొప్పున మాత్రమే పడింది. మొత్తం 512 కిలోల ఉల్లిగడ్డలను అమ్మేశాను. అంటే మొత్తం 512 రూపాయలు నాకు వచ్చాయి. కానీ, అందులో నుంచి రవాణా చార్జిలు, లోడింగ్ చార్జ్ ఇంకా తూకం రుసుములుగా మొత్తం 509.50 కట్ చేశారు' అని రైతు రాజేంద్ర తుకారాం చవాన్ బాధతో వివరించాడు. ఇవన్నీ అన్నీ పోను చవాన్ నెట్ ప్రాఫిట్ రూ. 2.49 వచ్చింది.


ఇక ఈ డబ్బులను పోస్ట్ డేటెడ్ చెక్ రూపంలో అందించారు.ఒక 15 రోజుల తర్వాతే ఆ రూ. 2.49ని డబ్బుగా మార్చుకోవచ్చని చెప్పాడు. అయితే, చెక్‌ల డబ్బు రౌండ్ ఫిగర్లు కూడా చేస్తారు. కాబట్టి, పాపం తుకారాం చవాన్‌కు పై 49 పైసలు కూడా రౌండ్ ఫిగర్‌లో పోయి కేవలం రూ. 2 మాత్రమే చెక్ ద్వారా అందాయి. లేదూ.. ఇంకా ఆ 49 పైసలు కూడా అతనికి కావాలనుకుంటే.. అతను నేరుగా ట్రేడర్ నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. ప్రతి సంవత్సరం సాగు వ్యవసాయం పెరుగుతుంటే... చేతికి వచ్చే డబ్బులు మాత్రం కరిగిపోతున్నాయని ఆ రైతు ఎంతగానో బాధపడ్డాడు. ఈ 500 కిలోల ఉల్లి పంట కోసం తాను ఏకంగా రూ. 40 వేలు ఖర్చు పెట్టానని బాధతో వివరించాడు. గత మూడు నాలుగేళ్లలో సీడ్స్, ఫర్టిలైజర్లు ఇంకా పెస్టిసైడ్ల ధరలు కూడా దాదాపు రెట్టింపు అయ్యాయని అన్నాడు.రాజేంద్ర తుకారాం చవాన్ మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలోని బార్షి తాలూకా బార్గావ్ గ్రామానికి చెందిన వాడు.గత సంవత్సరం కిలో ఉల్లిగడ్డకు రూ. 20 పొందానని, కానీ, ఈ సారి కేవలం రూ.1 మాత్రమే పొందానని బాధతో అతను వాపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: