కంటి వైద్యుడిగా మారిన కోతి.. ఏం చేస్తుందో చూడండి?
అయితే జంతువులన్నింటిలో కూడా మహా కొంటె జంతువు ఏది అంటే అందరూ కోతి అని చెబుతూ ఉంటారు. అంతేకాదు ఇక కొంటెతనానికి కోతినే చిరునామాగా చూపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కోతి చేసే కొంటె పనులు కొన్ని కొన్ని సార్లు కోపం తెప్పిస్తే మరికొన్నిసార్లు మాత్రం నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. ఇక కోతి చేసే అల్లరి అంతా ఇంత కాదు అని చెప్పాలి. అయితే కోతులకు సంబంధించిన వీడియోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమయ్యాయ్. కానీ ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో మాత్రం చాలా స్పెషల్ అని చెప్పాలి.
ఇక్కడ ఒక కోతి ఏకంగా కంటి వైద్యుడిగా మారిపోయి పక్కనే ఉన్న మరో కోతి కంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ వీడియో అందరికీ నవ్వు తెప్పిస్తుంది అని చెప్పాలి. ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే.. రెండు కోతులు ఒకచోట కూర్చుని ఉన్నాయి. ఇందులో ఒక కోతి ఏకంగా కంటి వైద్యుడి అవతారం ఎత్తింది. ఈ క్రమంలోనే డాక్టర్ లాగా మారి రకరకాల యాంగిల్స్ లో పక్కనే ఉన్న మరో కోతి కంటిని పరిశీలిస్తుంది. ఇక ఆ తర్వాత అక్కడే దొరికిన ఒక గ్రీన్ కలర్ ఆకును తీసుకొని కంటిని క్లీన్ చేసింది. మరో ఆరెంజ్ కలర్ ఆకును తీసుకొని కంటిని మరోసారి క్లీన్ చేససింది. ఇక కోతి ప్రవర్తించిన తీరు చూస్తూ ఉంటే ఏకంగా ఐ స్పెషలిస్ట్ కూడా ఇంత బాగా వైద్యం చేయడేమో అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అని చెప్పాలి.