వైరల్ : జిమ్ లో యువతిపై అత్యాచారయత్నం.. ఎలా అడ్డుకుందో చూడండి?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్న కూడా మహిళలపై అత్యాచార ఘటన రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది ఏకంగా మహిళ ఒంటరిగా కనిపించింది అంటే చాలు ఇక ఏదో ఒక విధంగా లైంగిక వేధింపులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మహిళలు అందరూ కూడా భయంతో ఊగిపోతున్నారు అనే విషయం తెలిసిందే. అయితే కొంతమంది మహిళలు మాత్రం ఇలా ఎవరైనా ఆకతాయిలో తమపై లైంగిక వేధింపులకు పాల్పడేందుకు వస్తే ఏకంగా అపర కాళీలా మారిపోయి వారిని ఎదిరిస్తూ ఉన్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయింది. ఆమె ఎప్పటి లాగానే జిమ్లో వర్కౌంట్లో చేస్తూ బిజీ బిజీగా ఉంది. అలాంటి సమయంలోనే ఆ జిమ్ లోకి ఒక ఆగంతకుడు కూడా వచ్చాడు. అతను కూడా వర్కౌట్లు చేయడానికి వచ్చాడేమో అని అనుకుంది సదరు యువతి. కానీ ఆ తర్వాత ఇక ఆ యువకుడు ఆ యువతి దగ్గరికి వచ్చి లైంగిక వేధింపులకు పాల్పడేందుకు ప్రయత్నించాడు. అసభ్యంగా తాకడానికి దగ్గరకి వచ్చాడు. దీంతో అందరిలా భయపడకుండా ఆ కామాంధుడితో ధైర్యంగా పోరాడింది ఆమె.

 అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన చోటు చేసుకుంది అన్నది తెలుస్తుంది. టంప నగరానికి చెందిన నషల అల్మా అనే 24 ఏళ్ళ యువతి ఫిట్నెస్. మోడల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావడం గమనార్హం. ఆమె తన అపార్ట్మెంట్లోని జిమ్లో రోజులాగే ఆమె వ్యాయామం చేస్తుంది. అలాంటి సమయంలో జిమ్లో ఆమె ఒక్కతే ఉండడం గమనార్హం. ఇంతలో ఒక వ్యక్తి జిమ్ లోకి వచ్చాడు. ఇక అతను కూడా వర్కౌట్లు చేసుకోవడానికే వచ్చాడు అనుకుంది యువతి. కాని కాసేపటికి యువతి దగ్గరికి వచ్చిన కామాంధుడు ఆమెను బంధించి ఇక లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించాడు.

 అయితే అయినప్పటికీ భయపడకుండా ఆ కామాంధుడితో  గట్టిగా పోరాడింది.   ధైర్యంగా అతడి భారీ నుంచి తనను తాను సురక్షితంగా రక్షించుకోగలిగింది అని చెప్పాలి. అయితే ఈ దృశ్యాలు అన్నీ కూడా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయ్ అని చెప్పాలి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఆ యువతీ ధైర్య సాహసాలు చూసిన నెటిజన్స్ అందరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: