ఇద్దరు కాదు, ముగ్గురు కాదు.. ఓకే బైక్ పై ఏడుగురు ప్రయాణం?

praveen
ఒకవైపు దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి కొంతమంది తీవ్ర గాయాల పాలై జీవచ్ఛవాలుగా మారిపోతూ జీవితం దుర్భరంగా మార్చుకుంటున్నారు. అయితే ఇలా రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు.. ప్రతి ఒక్కరు కూడా మోటార్ వెహికల్ చట్టంలోని అన్ని రూల్స్ ను ఫాలో కావాలని ప్రమాదాల నుంచి వారి ప్రాణాలకు వారే రక్షణ కల్పించుకోవాలంటూ వాహనదారులకు సూచిస్తున్నారు అధికారులు.

 ఇలాంటి సమయంలో రోజురోజుకు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించి సవ్యంగా వాహనాలు నడుపుతున్న వారు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అయితే రూల్స్ ప్రకారం కాకుండా పరిమితికి మించి ఒకే వాహనంపై ఎక్కువ మంది ప్రయాణిస్తూ చివరికి రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు బైక్ పై ముగ్గురు లేదా నలుగురు ప్రయాణించడం చూసాము. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా తన బైక్ ని సెవెన్ సీటర్ ఆటో గా మార్చాడు. ఈ ఘటన బీహార్ లో వెలుగు చూసింది.

 ఇద్దరు కంటే ఎక్కువ మంది కూర్చోవడానికి అవకాశం లేని బైక్ పై ఏకంగా తనతో పాటు ఆరుగురుని ఎక్కించుకొని ఒక వ్యక్తి వాహనాన్ని నడిపాడు. ఇక ఈ ఘటన అక్కడున్న స్థానికులు అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. బంక జిల్లాలోని భాగల్పూర్ - హస్ దిహ ప్రధాన రహదారిలో ఉన్న బౌన్సీలో ఒక బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు ముగ్గురు చిన్న పిల్లలు మరో మరో ముగ్గురు పెద్దవాళ్లు బైక్ పై కూర్చున్నారు. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: