వీడి పైత్యం తగలెయ్య.. విమానంలో ఏం అడిగాడో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో విమాన ప్రయాణాలకు సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది ప్రయాణికులు విమానంలో అనుచితంగా ప్రవర్తిస్తూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఏకంగా విమానంలో ప్రయాణించేవారు ఇలాంటి ప్రవర్తన ఏంటి అని ప్రతి ఒక్కరు షాక్ తో ఉన్నారు అని చెప్పాలి. అంతేకాదు ఇక కొంతమంది ప్రయాణికులు అయితే ఇతర ప్రయాణికులపై దాడులకు పాల్పడటం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నాయని చెప్పాలి.
 అయితే సాధారణంగా విమాన ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఇక ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎయిర్ హోస్టస్ అన్ని చూసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు విమానంలో ఆహార అందించడం పానీయాలు తీసుకెళ్లడం లాంటివి నిషేధం. ఏది అవసరమైన అది విమానం లోపలే అందుబాటులో ఉంచుతారు అన్న విషయం తెలిసిందే. మద్యం లేదా సిగరెట్ తాగడం గుట్కా నమలడం లాంటివి విమానంలో నిషేధం.

 సాధారణంగా విమానంలో ప్రయాణించే ప్రయాణికులు ఎవరైనా సరే ఇక గుట్కా నమలడం లాంటివి చేయరు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక ప్రయాణికుడు మాత్రం ఇలాంటి పని చేస్తాను అంటూ చెప్పి షాక్ ఇచ్చాడు.  తన దగ్గరికి పిలిచి గుట్కా ఉమ్మి వేయడానికి కిటికీని తెరవాలి అంటూ కోరడంతో ఒక్కసారిగా ఎయిర్ హోస్టేస్ గట్టిగా నవ్వుకుంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చి వైరల్ గా మారింది  అని చెప్పాలి. ఒక వ్యక్తి తంబాకు చాలా చేతిలో వేసుకున్నట్లు నటించడం మొదలు పెట్టాడు. ఈ సమయంలో మహిళా సిబ్బంది కిటికీ తెరవాలంటూ అడుగుతాడు. ఎందుకు అని ఎయిర్ హోస్టేస్ అడగగా గుట్కా ఉమ్మి వేయాలని దానికి కిటికీ తెరవాలి అంటూ కోరుతాడు దీంతో ఎయిర్ హోస్టెస్ తెగ నవ్వుకుంటుంది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: