అయ్య బాబోయ్.. స్పీడ్ బ్రేకర్ ప్రాణం తీసింది?

praveen
అతివేగం ప్రమాదకరం అంటూ అటు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికి అక్కడ బోర్డులు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు . కానీ వాహనదారుల నిర్లక్ష్య వైఖరిలో మాత్రం అసలు మార్పు రావడం లేదు. లక్షలు పోసి వాహనాలు కొనుగోలు చేసింది స్లోగా వెళ్లడానికా అని భావిస్తూ ఉన్నారు. ఇక వేగంగా బండి నడుపుతూ చివరికి ప్రమాదాల పారిన పడుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఎంతో మంది వాహనదారులు చేజేతులారా నిర్లక్ష్యపు వైఖరితో ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు నేటి రోజుల్లో కోకోళ్ళలుగా వెలుగులోకి వస్తున్నాయి.

 ఇటీవల కాలంలో వాహనదారులు ఎక్కువ వేగంగా వెళ్లకుండా ఉండేందుకు అక్కడక్కడ రహదారులపై ఏకంగా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక ఇలా స్పీడ్ బ్రేకర్ల కారణంగా ఎంతో మంది వాహనదారులు కాస్త మెల్లిగా వెళ్లేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే కొంతమంది వాహనదారులు మాత్రం ఈ స్పీడ్ బ్రేకర్లను గమనించకుండా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా కూకట్పల్లి పరిధిలోని వివేకానంద నగర్ ప్రధాన రహదారిపై ఓ యువకుడు ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ స్పీడ్ బ్రేకర్ గమనించకుండా వేగంగా దూసుకు వచ్చి కింద  పడిపోయాడు.

 అయితే ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన యువకుడుని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు అని చెప్పాలి. ఇక ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో కాస్త అక్కడ సిసి కెమెరాల్లో రికార్డు అయ్యి ప్రస్తుతం ట్విట్టర్ వేదిక వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని కొంతమంది చెబుతూ ఉంటే.. ఇక అతివేగం ప్రమాదకరమని చెబుతున్న ఎవరు వినట్లేదని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: