వైరల్ : అదృష్టవంతుడు.. లేదంటే ఎంత ఘోరం జరిగేదో?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది తప్ప ఎక్కడ తగ్గ ముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. అయితే ఎంతో మంది వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటిస్తూనే వాహనాలు నడుపుతున్నప్పటికీ ఇక ఎదుటివారి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాల బారిన పడుతూ ఉండడం లాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని కొన్ని సార్లు ఇలా ఎదుటివారి నిర్లక్ష్యం కారణంగా రూల్స్ పాటించిన కూడా చివరికి ఎంతోమంది వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు.

 ఇటీవల కాలంలో ఏకంగా రోడ్డు ప్రమాదాల కారణంగా కొంతమంది ప్రాణాలు కోల్పోతుంటే ఇంకొంతమంది మాత్రం ఈ భూమ్మీద నూకలు తినే బాకీ ఇంకా ఉందేమో అని అనుకునే విధంగా పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి బయటపడుతూ ఉండడం లాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. ఏకంగా ఒక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. కానీ అదృష్టం బాగుండడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తమిళనాడు రాష్ట్రంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది.
 తూత్తుకుడి జిల్లా శ్రీ వైకుంఠం పట్టణానికి చెందిన ముత్తు అనే వ్యక్తి బైక్ పై వెళ్తూ ఉన్నాడు. ఏరల్ ప్రాంతం వద్ద తనకు ఎదురుగా ఒక లారీ వస్తుంది. అయితే ఇక లారీ పక్క నుంచి వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా లారీకి వేలాడుతున్న తాడు అతని మెడకు చుట్టుకుంది. రెప్పపాటు కాలంలో అతను ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు. మెడకు చుట్టుకున్న తాడు తెగిపడిపోయింది. దీంతో రోడ్డు మీద పడిపోయి స్పృహ కోల్పోయాడు. అయితే రెండు నిమిషాల పాటు అతను ఎలా పడ్డాడు అనే విషయం కూడా అతనికి అర్థం కాలేదు. సిసిటీవీలో పరిశీలిస్తే అసలు విషయం తెలిసింది. అయితే తాడు తెగిపోకపోయి ఉంటే మాత్రం ఎంత ఘోరం జరిగేదో అని ఊహించుకోడానికే భయంగా ఉందని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కూడా చెబుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: