పొట్టకూటి కోసం బాలికల పోరాటం.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు?

Purushottham Vinay
ఈ ప్రపంచంలో అందరి జీవితం ఒకలా ఉండదు. కొందరికి డబ్బులు ఎక్కువయ్యి ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలీక సతమతం అవుతూ ఉంటే కొందరు మాత్రం ఒక్క పూట భోజనం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఇక తమ సమస్యలను తీర్చుకోవడనికి జీవితాన్ని జీవించడానికి ఎన్నో అష్టకష్టాలు పడతారు.తమ సమస్యలు అనేవి శాశ్వతంగా తీరిపోవాలని సంతోషంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. మన జీవితం ఒక పోరాటమని శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ప్రతి వ్యక్తి కూడా జీవితంలో జీవించడానికి ఎప్పుడూ పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇక మానవ రూపంలో దేవుడే భూమి మీదకు దిగి వచ్చినా ఆయన కూడా సవాళ్ల నుండి తప్పించుకోలేడు. ఇక కొంతమంది జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. అటువంటి వారి కష్టాలను చూస్తే ఖచ్చితంగా కన్నీళ్లు వస్తాయి. ఇక ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ఖచ్చితంగా హృదయాన్ని కదిలిస్తుంది.


నిజానికి ఈ వీడియోలో.. ఇద్దరు చిన్నారులు రోడ్డు పక్కన విన్యాసాలు చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ సమయంలో అక్కడ జనం వస్తూ చూస్తూ పోతూనే ఉన్నారు. ఎవరూ కూడా ఆ చిన్నారుల దగ్గర ఆగి వారి ఫీట్స్ ను చూసి కొంత డబ్బు సహాయం చేయడానికి రెడీగా ఉండరు. అలాంటి పరిస్థితిలో ఢోలు వాయిస్తున్న ఓ అమ్మాయికి దెబ్బకి కన్నీళ్లు వచ్చాయి. బాధతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అయితే తన ఏడుపు తన జీవితాన్ని సులభతరం చేయదని ఆ బాలిక అనుకోని మళ్ళీ తన పోరాటం సాగించింది. ఇక ఆ వీడియోలో చూస్తే ఆ బాలిక రోడ్డుకు అవతలి వైపు తన సోదరి గారడీ చేస్తున్నప్పుడు.. కన్నీరు నిండిన కళ్లతో ఢోలు వాయిస్తుంది. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఎవరి కళ్ళు అయినా కన్నీళ్లు పెట్టక మానవు.కేవలం 24 సెకన్ల ఈ వీడియోను ఇప్పటిదాకా ఎన్నో వేలాది మంది వీక్షించారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: