వామ్మో డైనోసార్‌లు ఇప్పటికీ ఉన్నాయి.. ఇదే సాక్ష్యం?

Purushottham Vinay
ఇక ఎన్నో మిలియన్ల సంవత్సరాల క్రితం భారీ జంతువులు భూమిపై నివసించేవి. అవి ఇప్పుడు కనిపించే ఏనుగుల కంటే ఎన్నో రెట్లు పెద్దవి. అటువంటి భారీ జంతువుల్లో డైనోసార్‌లు  ఒకటి.చూడడానికి చాలా భయంకరంగా ఇంకా భారీగా ఉండే ఈ జీవులు ఎప్పుడో అంతరించిపోయాయి. సుమారు 65 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఒక పెద్ద ఉల్క పడిపోవడం వల్ల ఈ రాక్షస జీవులు శాశ్వతంగా అంతరించిపోయాయనట . అయితే ఈ రాక్షస జీవులు భూమిపై కనిపించనప్పటికీ అప్పుడప్పుడు మనం సినిమాల ద్వారా చూస్తూనే ఉన్నాం. ఇక జురాసిక్‌ పార్క్‌ సిరీస్‌ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ డైనోసార్స్ కు సంబంధించిన ఆనవాళ్లు అక్కడక్కడా దొరుకుతూ మనకు కనిపిస్తున్నాయి. వాటిని బట్టే ఈ జీవులకు సంబంధించిన చాలా విశేషాలను శాస్త్రవేత్తలు బయటకు తీసుకువచ్చారు. అయితే అప్పుడప్పుడు డైనోసార్లు కనిపించాయంటూ కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు డైనోసార్లు ఇంకా బ్రతికే ఉన్నాయా? అని ఆశ్చర్య పోయి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


నిజానికి ఈ వీడియోలో డైనోసార్‌ల లాగా ఉండే కొన్ని వింత జీవులు అడవిలో పరిగెడుతూ కనిపిస్తున్నాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైన వీడియో అని చెప్పాలి. అడవిలో డైనోసార్‌ల లాగా ఉండే చిన్న చిన్న జీవులు బుల్లి బుల్లి అడుగులు వేస్తుండడం మనం ఈ వైరల్ వీడియోలో చూడవచ్చు.అయితే నిజమైన డైనోసార్‌లతో పోలిస్తే ఎత్తులో ఇవి చాలా చిన్నవి అయినప్పటికీ, మెడ మాత్రం అచ్చం డైనోసార్లలాగే ఉంటోంది. ఇక శాకాహార డైనోసార్లకు ఇంత సన్నగా పొడుగ్గా ఉండే మెడలు ఉండేవని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఇంకా ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత, ఇవి నిజంగా డైనోసార్‌లా లేదా మరే ఇతర జీవులా అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ  వైరల్ వీడియో @Gulzar_sahab అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్‌ చేయడం జరిగింది. దీనికి 'ఈ డైనోసార్‌లు ఎక్కడ నుండి వచ్చాయి?' అనే క్యాప్షన్‌ను ఇచ్చారు. కేవలం 11 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోకు ఇప్పటి దాకా కూడా లక్షల్లో వ్యూస్‌, వేలాది లైకులు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: