తల్లి పులిని భయపెట్టి నవ్వులు పూయించిన పిల్ల పులి?

Purushottham Vinay
ఇక జంతువుల వీడియోలు చాలా అందంగా ఇంకా అలాగే ఫన్నీగా ఇంకా కొన్ని అయితే భయంకరంగా కూడా ఉంటాయి. కొన్ని వీడియోలు అయితే ఇంటర్నెట్‌లో వీక్షకుల హృదయాలను గెలుచుకుంటాయి. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతున్నాయి.అందులో కొన్ని వీడియోలు అయితే సోషల్ మీడియా వినియోగదారులను దిగ్భ్రాంతి కలిగిస్తే.. మరికొన్ని మాత్రం నవ్వు పుట్టించే విధంగా ఉంటున్నాయి.ఎక్కువగా సోషల్ మీడియాలో విచిత్రమైన వీడియోలు, జంతువులు ఇంకా అలాగే పాములకు సంబంధించిన వీడియోలు చెక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అలాంటిదే పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ మళ్లీ వైరల్‌ అవుతోంది. ఈమధ్య ట్విట్టర్‌లో షేర్‌ చేయబడ్డ ఈ వీడియోలో తెల్లటి పులి పిల్ల ఒకటి తన తల్లి చుట్టూ తిరుగుతూ ఆటపట్టిస్తున్న దృశ్యం అయితే అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. కానీ, ఆ తల్లి పులికి మాత్రం పెద్ద షాక్‌ తగిలినంత పనైంది.ఇక అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రాయల్ బెంగాల్ జాతికి చెందిన తెల్లపులి.. దాని పిల్ల చేసిన పనితో దెబ్బకు భయపడింది. తల్లి ఎన్‌క్లోజర్‌ బయట ఏదో తింటూ ఉండగా.. ఇక వెనుక నుంచి ఒక్కసారిగా పులిపిల్ల వచ్చింది. నడుస్తూ కాకుండా గది లోపలి నుంచి ఎగిరి అది తల్లి ముందు దూకింది.దాంతో తనపై ఏదో దాడి చేస్తుందనుకుని ఆ తల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది.అయితే, ఆ తల్లి భయంతో ఉలిక్కిపడి కింద పడిపోవడం చూసి పిల్లపులి కూడా ఎంతగానో భయపడింది. ఆ భయంతో అది రెండడుగులు వెనక్కి వేసింది. ఆ తర్వాత తల్లికి కోపం వచ్చిందని గ్రహించి ఏమీ ఎరుగనట్టు మెల్లగా అది పక్కకు వెళ్లిపోయింది. కేవలం మూడు సెకన్‌ల నిడివిగల ఈ వీడియో చూసిన నెటిజన్లు అంతా కూడా కడుపుబ్బ నవ్వుకుంటున్నారు.. పిల్లల అల్లరి అనేది అసలు ఎక్కడైనా ఒకేలా ఉంటుందంటూ నెటిజన్లు విపరీతంగా ఈ వీడియోని చూసి కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: