Viral Video: ఈ చిన్నారి ఎంతో దయామయుడు?

Purushottham Vinay
పసి పిల్లలు దేవుడితో సమానం. వారి మనసు తెల్లకాగితం లాంటిది. పిల్లలకు వారి తల్లిదండ్రులే మొదటి గురువులు.తల్లిదండ్రులను చూసే వారు సరైన నడవడిక నేర్చుకుంటారు. అందుకే పసి పిల్లలకు వారి చిన్న నాటి నుంచే మంచి అలవాట్లను నేర్పించాలని పెద్దలంటారు.చిన్నప్పటి నుంచే వారిలో దాన గుణం ఇంకా అలాగే సాటివారికి సాయపడటం లాంటివి అలవాటు చేయాలి. అందుకే కొంత మంది ఎవరికైనా సాయం చేయాలనుకున్నప్పుడు వారి పిల్లలతో చేయిస్తారు.ఎందుకంటే ఇది చాలా మంచి అలవాటు.పసి వయసులో వారు చేసే ఇలాంటి మంచి పనులు వారి మనసులో పెద్దయ్యే దాకా ముద్రపడిపోతాయి. ఇంకా అలాగే భవిష్యత్తులో ఆ పిల్లలు కూడా ఇతరులకు సహాయం చేయడం అలవాటు చేసుకుంటారు. ఇక కేవలం మనుషుల పట్లే కాదు.. మూగజీవాల పట్ల కూడా వారు తమ మానవత్వాన్ని చాటుతారు. సరిగ్గా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ బాగా వైరల్‌ అవుతుంది.ఇక సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్నబాలుడు తన తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లినట్టున్నాడు. 


అక్కడ పొలం గట్టుమీద కూర్చుని ఆ ముద్దుల చిన్నారి ఒక గిన్నెలో ఆహారం పట్టుకొని తింటున్నాడు. ఇక ఇంతలో ఆ చిన్నారి వద్దకు నాలుగు పక్షులు వచ్చి వాలాయి. అతను తింటుంటూ అవి అలానే చూస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆ బాలుడు వాటి ఆకలిని ఇంకా అలాగే ఆసక్తిని గ్రహించి తన ఆహారాన్ని వాటికి స్వయంగా తినిపించాడు. ఒక సన్నని స్టిక్‌తో ఆ చిన్నారి బాలుడు తన చిట్టి చేతులో ఆ పక్షులకు ఆహారం పెడుతుంటే అవి ఎంతో ఆరాటంగా తింటున్నాయి.ఇక ఈ క్యూట్‌ వీడియోను ఐఏఎస్ అధికారి సోనాల్ గోయెల్ షేర్ చేయడం జరిగింది. ఈ చిన్న పిల్లవాడి సానుభూతి, కరుణ ఇంకా అలాగే దయ స్పూర్తిదాయం అంటూ క్యాప్షన్‌ జోడించారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను మొత్తం కూడా 30 వేలమందికి పైగా వీక్షించారు. వందల్లో లైక్‌ చేస్తున్నారు. ఈ చిన్నారి దయా హృదయానికి నెటిజన్స్ ప్రశంసల కామెంట్లు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: