తందూరి చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్..క్యాన్సర్ రావచ్చు..

Satvika
చికెన్ ప్రియులకు ఎటువంటి వెరైటీని అయిన కూడా లోట్టలు వేసుకుంటూ తింటారు..తందూరి చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు.బొంగుల చికెన్ మొదలు శవర్మా వరకు చికెన్ వంటకాలు మార్కెట్లోకి వచ్చాయి. చికెన్‌తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటూ ఒకటే ప్రచారం. చికెన్‌లో భారీగా ప్రోటీన్లు ఉంటాయన్నది మాత్రం నిజం. అయితే ఇక్కడి వరకు ఒకే కానీ.. చికెన్‌లో చిత్రవిచిత్రమైన వంటకాల పద్దతే ఇప్పుడు ఆరోగ్యానికి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి. ముక్కలేనిదే ముద్ద దిగనిస్థాయికి వెళ్లిపోయారు చికెన్ ప్రియులు.

ధర ఎంతైనా వారానికి ఒకసారైనా లొట్టలేస్తూ లాగిస్తున్నారు. అందులోనూ.. నిప్పులపై కాల్చి తయారు చేస్తే.. అది మరీ గ్రాండ్ అని ఫీలవుతున్నారు. కాల్చిన చికెన్‌ను రాజాలా తినేందుక తెగ ముచ్చట పడుతున్నారు నేటి తరం జనం. తందూరి చికెన్ అంటే అందరికీ నోరూరుపోతుంది. దానిలో.. బాగా ఫ్రై చేసిన పీస్‌ అయితే.. మరింత ఇష్టంగా లాగించేస్తారు..టేస్ట్ ఓకే కానీ,దాన్ని వండే విధానం లో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు నిపుణులు..

మంట మీద పెట్టి కాల్చడం వల్ల దాని పై పొరపై క్యాన్సర్ సమ్మేళనాలు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. మనలో కండలు పెరిగేందుకు దోహద పడే “ఆర్గానిక్ యాసిడ్” అధిక మంట మీద వేడి చేసినప్పుడు క్యాన్సర్ కి కారణమయ్యే “హెటెరోసైక్లిక్ అమైన్‌”లుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే అవి కాలుతున్నప్పుడు వాటి కొవ్వు నిప్పు మీద పడుతుంది. ఇది పాలీ సైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రోకార్బన్ లకి దారితీస్తుంది.. ఇలా తీసుకుంటే మాత్రం క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు..

కాల్చిన మాంసాన్ని తినడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని మిన్నేసోటా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.బాగా స్టీక్ చేసిన ఆహారం తినని వారితో.. స్టీక్ చేసిన ఆహారం తినే వాళ్ళని పోలిస్తే 60 శాతం మందికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. మయి క్లినిక్ ప్రకారం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ దాని ప్రారంభ దశల్లో గుర్తించడం చాలా కష్టం. అది ఇతర అవయవాలకి వ్యాపించి ప్రాణాలు కూడా పోతాయని హెచ్చరిస్తున్నారు..చుసారుగా రుచిగ ఉందని మెక్కారో ప్రాణాలు పొతాయ్..జాగ్రత్త..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: