యాక్.. ఇదిచూస్తే మరోసారి ట్రైన్ లో టీ తాగరు?

praveen
ప్రతి ఒక్కరి జీవితంలో ట్రైన్ ప్రయాణాలు అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయ్ అని చెప్పాలి. ఎక్కడికైనా సుదూర ప్రాంతాలకు వెళ్లాలి అనుకునేవారు ట్రైన్ లో ఎక్కువగా జర్నీ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు రకరకాల ఆహార పదార్థాలు పానీయాలు అమ్మడం లాంటివి చూస్తూ ఉంటాం. అయితే ఎంతో మంది ప్రయాణికులు అపరిశుభ్రమైన వాతావరణంలో పానీయాలు ఆహారం ఉంటుంది కాబట్టి కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కానీ ఎప్పుడైనా ట్రైన్ లో లాంగ్ జర్నీ చేయాల్సి వచ్చిన సమయంలో తప్పని పరిస్థితుల్లో వాటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది.

 ముఖ్యంగా ఎక్కువ మందికి టీ తాగే అలవాటు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ట్రైన్ లో తరచూ వేడి వేడి టీ కొనుగోలు చేసి తాగడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియోలు చూస్తే మాత్రం మరోసారి రైలులో ప్రయాణం చేసేటప్పుడు చాయ్ తాగాలని సాహసం కూడా చేయరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ట్రైన్ లో టీ అమ్మే వ్యక్తి ఎలా వేడి చేస్తున్నాడో ఇతరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఏకంగా ట్రైన్ లో టీ ని వేడి చేయడానికి శుభ్రంగా లేని ఒక హీటర్ను ఉపయోగించి సదరు వ్యక్తి ఇక చాయిని వేడి చేస్తూ ఉండడం చూడవచ్చు.

 ఇక ఈ వీడియోలో చూస్తేనే ప్రతి ఒక్కరికి కూడా వాంతు వస్తుంది అని చెప్పాలి. అలాంటిది ఇక ఇలాంటి చాయ్ తాగితే ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సబరి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో విక్రయించే ఆహార పానీయాలు చాలా ఘోరంగా ఉంటాయని చెబుతున్నారు ప్రయాణికులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోవడంతో మరోసారి ట్రైన్ లో ఛాయ్ తాగబోము అంటూ ఎంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారి కాంట్రాక్ట్ రద్దు చేయాలి అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: