యజమానికి కుక్క పిల్ల సాయం.. వెరీ క్యూట్?

Purushottham Vinay
మనం ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలతో వున్న రిలేషన్ ఎప్పుడూ కూడా వెరీ వెరీ స్పెషల్. మనుషులకు మంచి స్నేహితుడిలా మెలగడంలో పెంపుడు కుక్కలు ఎప్పుడూ కూడా ముందుంటాయి.అవి చనిపోయేవరకు కూడా మనకు తోడు ఉంటాయి.తమ యజమాని పట్ల అత్యంత విశ్వాసం కలిగి ఉంటాయి. అందుకనే కుక్కలను తమ కుటుంబ సభ్యులతో సమానంగా ప్రేమగా చూసేవారు చాలామంది ఉన్నారు. కుక్కలు కూడా తమ యజమాని పట్ల అత్యంత విశ్వాసం ప్రేమ కలిగి ఉంటాయి. తాజాగా ఓ వైరల్‌ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. ఇందులో ఓ చిన్న కుక్కపిల్ల బామ్మ పట్ల చూపించిన ప్రేమ ఎంతటి కఠిన హృదయం కలిగిన వారినైనా కదిలిస్తుంది. అంతేకాదు.. ప్రేమ, దయ లేని కొంతమంది పిల్లల కంటే.. ఇలాంటి ఒక కుక్క ఉన్నా చాలు అనిపిస్తుంది ఎవరికైనా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.


వైరల్ అవుతున్న వీడియోలో ఓ బామ్మ గార్డెనింగ్‌ చేస్తుంది. అక్కడ ఓ బుజ్జి కుక్కపిల్ల కూర్చుని ఉంది. అయితే ఆ క్యూట్ క్యూట్ కుక్క పిల్ల.. బామ్మ ని చూసి.. వెంటనే కూర్చునేందుకు స్టూల్‌ను జరుపుతూ ఉంది. ఆ చిన్న కుక్కపిల్ల బామ్మ పట్ల చూపించిన ప్రేమ.. చేసిన సాయం.. విన్యాసం నెటిజన్లను ఫిదా చేస్తోంది. బామ్మ కూర్చునేందుకు కుర్చీ కోసం చూస్తుండటం పసిగట్టిన పప్పీ అక్కడే ఉన్న చిన్న స్టూల్‌ను ఆమె వైపు తోస్తుండటం ఈ క్లిప్‌లో కనిపించింది.ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్స్ బాగా ఫిదా అవుతున్నారు. ఈ కుక్క పిల్లకి ఫ్యాన్ గా మాటిపోతున్నారు. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అలాగే చాలా మంది కూడా షేర్  చేస్తూ ఈ చక్కటి వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్  చేస్తున్నారు.ఇక ఈ వీడియోకు ఏకంగా 88 లక్షల పైగా వ్యూస్‌ లభించాయి. బుటెంగ్‌బిడిన్‌ ఈ క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేయగా పెద్దసంఖ్యలో యూజర్లు కామెంట్స్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: