కోతా.. మజకా..ఒక్క పంచ్ కే బొమ్మ కనపడింది..

Satvika
అడవులను నరికి వెయ్యడంతో వన్యమృగాలు, జంతువులు ఇళ్లల్లోకి వస్తున్నాయి. దాంతో జనాలు ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు.. ఇటీవల కాలంలో చిరుత పులులు సైతం ఇళ్ళ లోకి వస్తున్నాయి.. ఇక కోతులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇళ్ళ మీద కాచుకొని కూర్చుంటాయి.. ఈ మధ్య కోతుల దాడులు ఎక్కువ అయ్యాయి. మొన్నీమధ్య ఓ వ్రుద్దురాలిని కోతుల మూక చంపెసింది.. ఆ ఘటన మరువక ముందే మరో ఘటన నెట్టింట చక్కర్లు కోడుతుంది.. ఓ కోతి ఒక్క దెబ్బ తో యువకుడిని నేల పై పనెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇది చూసిన వారంతా కూడా ముక్కున వేలు వేసుకున్నారు..

ఇందులో ఇంటి వద్దకు వచ్చిన కోతిని తరిమేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తాడు. దాని మీదకు రాయి విసిరేందుకు కిందకు వంగి రాయిని తీయబోయాడు. అయితే ఆ వ్యక్తి చర్యను గమనించిన ఆ కోతి ఒక్కసారిగా అతడి మీదకు దూకుతుంది. దీంతో అతడు అదుపు తప్పి కిందపడ్డాడు. ఆ షాక్‌ నుంచి అతడు తేరుకుని పైకి లేచి కోతి కోసం అటూ ఇటూ చూస్తాడు. అయితే అప్పటికే అది అక్కడి నుంచి జారుకుంటుంది.. కోతి కొట్టిన దెబ్బకు మనోడికి ఫ్యుజులు ఎగిరిపొయాయి..

ఇక విషయానికొస్తే.. ఈ షాకింగ్ ఘటన తిరువనంతపురంలో చోటుచేసుకుంది. ఒక ట్విట్టర్‌ యూజర్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇప్పటికే ఐదు లక్షల మందికిపై గా ఈ వీడియోను వీక్షించడం విశేషం. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు, రియాక్షన్‌లు పెడుతున్నారు. కోతి జాన్‌సేన (డబ్ల్యూడబ్ల్యూఈ బాక్సర్‌)గా మారిందని ఒక్క పంచ్‌కే పడగొట్టేసిందని ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు. ఈ కోతి చాలా డేంజరంటూ, వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలంటూ మరికొంతమంది నెటిజన్లు సూచిస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో నెట్టింట అవుతుంది. మీరు ఆ పంచ్ ను ఒకసారి చూడండి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: