కోట్లు పెట్టి నీటిలో తేలియాడే ఇల్లు నిర్మించారు.. కానీ మొదటి రోజే?

praveen
ఇటీవల కాలంలో ఎంతోమంది తమ క్రియేటివిటీ తో సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నారు. అందరిలా కాదు కాస్త డిఫరెంట్ గా ఉండాలని ప్రయత్నిస్తున్న వారి సంఖ్య నేటి రోజుల్లో పెరిగిపోతూనే ఉంది. వేసుకునే బట్టల దగ్గర నుంచి ఉండే ఇల్లు వరకు కూడా అన్ని కాస్త డిఫరెంట్ గానే ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా వెనకాడటం లేదు అని చెప్పాలి. ఇక్కడ ఒక కంపెనీ భారీగా డబ్బు ఖర్చు పెట్టి అందరిలా భూమ్మీద కాదు నీటిలో తేలియాడే ఇల్లు కట్టుకోవాలి అని భావించింది.

 ఇక వారి అభిరుచులకు తగ్గట్లుగానే భవనం మొత్తం నిర్మాణం అయింది. ఇక అందరిని   పిలిచి ఆ భవనాన్ని  లాంచ్ చేయాలి అని భావించారు కంపెనీ వాళ్ళు. కానీ అంతలోనే అతనికి ఒక చేదు అనుభవం ఎదురయింది. ఎందుకంటే నీటిలో తేలియాడే భవనాన్ని లాంచ్ చేసిన రోజే అది నీళ్లలో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విటర్ వేదికగా తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. సిపాడ్ పేరిట పనమ అనే కంపెనీ ఒక భవనాన్ని తయారు చేసింది. ఈ భవనం వాస్తవానికి నీళ్లలో తేలియాడుతూ ఉండాల్సి ఉంటుంది.

 300 గజాల విస్తీర్ణంలో లివింగ్ రూమ్ ఉంటుంది. అయితే దీనికి కొంచెం దూరంగా నీటిమట్టానికి 7.5 అడుగుల ఎత్తులో మూడు హాఫ్ ఫ్లోర్స్ కూడా ఉంటాయి. దీని నిర్మాణానికి దాదాపు 1.5 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ ప్రకారం 12 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారు. ఇక ఈ ఇంటిని లాంచ్ చేసే కార్యక్రమం కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే అప్పటికి కొన్ని రోజులపాటు నీళ్లలో ఉన్న ఆ భవనం అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా భయపడిపోయారు. సాంకేతిక లోపం కారణంగానే ఇలా జరిగిందని సదరు కంపెనీ ప్రతినిధులు చెబుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: