కదులుతున్న రైల్లో విన్యాసాలు.. చివరికి ప్రాణం పోయింది?

praveen
ఇటీవల కాలంలో ఆకతాయిలా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు ఆకతాయిలు చేసే పనులు ఇతరుల ప్రాణాల మీదికి తెస్తూ ఉంటే.. ఇంకొన్నిసార్లు వారు చేస్తున్న నిర్లక్ష్యమైన పనులు వారి ప్రాణాలు మీదికే తెస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కదులుతున్న రైళ్లలో ఎంతోమంది ఆకతాయిలు చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. ప్రమాదకరమైనది అని తెలిసినప్పటికీ కూడా ఏదో ఒకటి విచిత్రంగా చేస్తూ ఇక ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.

 ఇక కొన్ని కొన్ని సార్లు ప్రమాదకరమైన స్టంట్స్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం లాంటి ఘటనలు కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కదులుతున్న రైల్లో విన్యాసాలు చేసి ఓ యువకులు ప్రాణాలు కోల్పోయాడు.. రైలు ఎక్కేటప్పుడు రైలులో ప్రయాణించేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలని నిర్లక్ష్యంగా ప్రవర్తించవద్దు అని అధికారులు ఎంత హెచ్చరించినా ఎవరిలో మార్పు రావడం లేదు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇప్పటికీ ఎంతో మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారు. మాల్వ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తూ ఓ యువకుడు మరణించాడు. పంజాబ్ యుథియానా జిల్లా కన్నాలోని చావా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒక వ్యక్తి ట్రైన్ లో మెట్ల దగ్గర వేలాడుతూ కనిపించాడు. ఆ సమయంలో ట్రైన్ ఎంతో వేగంతో దూసుకుపోతుంది. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత అతడి తల స్తంభానికి తగలడంతో కింద పడిపోయి మరణించాడు. అయితే మొదట మెట్ల దగ్గర కూర్చొని పడిపోయినట్లు అందరు భావించారు.  కానీ యూట్యూబ్లో వైరల్ గా మారిపోయిన వీడియో చూసిన తర్వాత ట్రైన్ డోర్ దగ్గర వేలాడటంతోనే ప్రాణాలు కోల్పోయాడు అన్న విషయం అందరికీ అర్థమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: