వైరల్ : ట్రక్కును ఢీ కొట్టిన ఖడ్గమృగం.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో మనుషులు పెరుగుతున్నారు. వాహనాలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో ఏ రోడ్డుపై చూసినా కూడా వాహనాల రద్దీ కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇక వాహనాలు కొనుగోలు చేసిన వారు ఇష్టానుసారంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ చివరికి ఎన్నో ప్రమాదాలకు కారణమవుతున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా అడవుల మధ్యలో నుంచి ఉన్న పెద్ద పెద్ద రహదారులపై భారీ వాహనాలు వెళుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే అడవుల్లో ఉండే కొన్ని జంతువులు రహదారుల పైకి వచ్చి చివరికి వాహనాలు ఢీకొట్టడంతో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి.

 ఇలాంటి ఘటనలు జరగకుండా అటు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్కడక్కడ మాత్రం అడవుల్లో నుంచి రహదారుల మీదికి వస్తున్న జంతువులు చివరికి వాహనాలకు బలి అవుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోని పోస్ట్ చేసింది ఎవరో కాదు స్వయంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోని షేర్ చేశారు.

 ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.. ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఒక భారీ ఖడ్గమృగం వేగంగా దూసుకు వస్తున్న ట్రక్కును ఢీకొట్టడం కనిపిస్తుంది. ఈ ఘటన ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దుబ్రీ జిల్లాలోని హల్దీ భారీ వద్ద ఈ ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఖడ్గమృగం ప్రాణాలతో బయటపడటం గమనార్హం ఇక ఆ ఖడ్గ మృగాన్ని ఢీకొట్టిన వాహనానికి జరిమానా విధించినట్లు సీఎం తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. అయితే ఇక ఇలాంటి తరహా ఘటనలు జరగకుండా వన్యప్రాణులను రక్షించాలని ఉద్దేశంతో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 32 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: