స్విమ్మింగ్ పూల్ లో డాన్సులు.. నెట్టింట వైరల్?

Purushottham Vinay
భారత దేశ వ్యాప్తంగా కూడా నవరాత్రి ఉత్సవాలు అనేవి చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఉత్సవాల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఉత్సవాల్లో సందడి చేస్తున్నారు.ఎంతలా అంటే అసలు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో ఉత్సాహంతో నవరాత్రులను ఆస్వాదిస్తున్నారు. సాంప్రదాయ రీతులలో అమ్మవారిని పూజిస్తారు. దాండియా, గర్బాను ప్రదర్శించే పురాతన సంప్రదాయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా దాండియా ను కొంతమంది యువతీ యువకులు స్విమ్మింగ్ ఫుల్ లో ఆడుతున్న వీడియో వైరల్ అవుతోంది.ఇక ఆధునిక హౌసింగ్ సొసైటీలు, ప్రొఫెషనల్ ఈవెంట్ నిర్వాహకులు పండుగ సందర్భంగా మెగా డ్యాన్స్ ఈవెంట్‌లను నిర్వహిస్తారు. సాంప్రదాయ నృత్యానికి కొంత వినోదాన్ని జోడించాలనే లక్ష్యంతో.. నృత్య ప్రదర్శనతో కొన్ని ప్రయోగాలు చేస్తారు. గుజరాత్‌లోని సూరత్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో కొంతమంది వ్యక్తులు దాండియా ఆడుతున్నట్లు కనిపించే ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది నిజంగా ప్రత్యేకమైనది. 


ఎందుకంటే ప్రజలు వేదికపై లేదా బహిరంగ మైదానంలో పండుగను ఆస్వాదించడం మనం ఇప్పటి వరకూ చూశాము. అయితే సాంప్రదాయ పద్ధతికి చెక్ పెడుతూ.. దాండియా స్విమ్మింగ్ పూల్‌లోకి ప్రవేశించింది.నవరాత్రుల్లో 8వ రోజుని దుర్గాష్టమిగా జరుపుకుంటారు. దుర్గామాత, మహాగౌరీని ఎనిమిదవ రోజు పూజిస్తారు. పురాణాల కథల ప్రకారం, శివుడిని భర్తగా పొందేందుకు పార్వతీ దేవి తపస్సు చేసింది. ఆ సమయంలో పార్వతి దేవి.. అడవిలో నిదురించింది. ఆకులపై నిద్రించింది. శివయ్యను భర్తగా పొందడం కోసం అనేక సంవత్సరాలు.. అనేక పరీక్షలను ఎదుర్కొంది. శివుడు. పార్వతి తపస్సును మెచ్చి.. తన భార్యగా అంగీకరించాడు. అప్పుడు శివయ్య పార్వతి దేవిని గంగానదిలోని నీటితో స్నానం చేయించాడు. అప్పుడు పార్వతి దేవి రంగును మారింది. అందుకనే పార్వతి దేవిని.. మహాగౌరి అని కూడా పిలుస్తారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతూ బాగా సందడి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: