కండక్టర్ ఝాన్సీకి సినిమా ఛాన్స్ ఇచ్చిన హీరో ఎవరో తెలుసా?

Satvika
టాలెంట్ ఎవరి సొత్తు కాదని చాలామంది నిరూపించారు.. ఇప్పుడు అత్యున్నత స్థానంలో ఉన్నారు..వారికి సంబందించినవి సోషల్ మీడియా ద్వారా కొన్ని వార్తలు ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బుల్లితెర మీద ఫెమస్ అయిన వాళ్ళు కూడా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో బాగా పాపులర్ అవుతున్నారు.. ఈ మధ్య కాలంలో కండక్టర్ జాన్సీపేరు గట్టిగానే వినిపించింది. గాజువాక డిపోలో కండక్టర్ గా పని చేసే జాన్సీ తన డ్యాన్స్ తో ప్రేక్షకులకు ఒక్కసారి స్క్రీన్ పై కనిపించి అదిరిపోయే మాస్ స్టెప్పులను వేసి అందరి గుండెల్లో నిలిచిపోయిన విషయం తెలిసిందే..

 ఒకప్పుడు ఎన్నో స్టేజ్ లపై డ్యాన్స్‌ వేసినా ఆమెకు గుర్తింపు రాలేదు. కానీ ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమైన ఓ షోలో ఓ ఫోక్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ఈ అమ్మడికి ఒక్కసారిగా పాపులారిటీ పెరిగిపోయింది. ఈ టీవీ షో తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జాన్సీ డాన్స్ వీడియోలో దర్శనమిచ్చాయి. తాజాగా ఈ టాలెంటెడ్ కండక్టర్ కు ఓ హీరో ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది.

కండక్టర్ ఝాన్సీ డ్యాన్స్‌కు హీరో సంపూర్ణేష్ బాబు కూడా ఆమెకు ఫ్యాన్ అయ్యిపోయాడు. ఆమె గురించి తెలుసుకొని.. తాను చేయబోయే సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు. సంపూర్ణేష్ బాబు నటిస్తున్న నెక్ట్స్ లో ఓ స్పెషల్ సాంగ్ లో జాన్సీకి ఛాన్స్ ఇచ్చారు.స్వయంగా సంపూర్ణేష్ బాబు ఫోన్ చేయడంతో ఝాన్సీ తెగ ఆనందపడిపోతుంది. ఆఫర్ రావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ పాట షూటింగ్ మొదలు పెట్టనున్నారు. సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు..ఆ సినిమా మంచి హిట్ టాక్ ను అందుకుంటే మాత్రం ఝాన్సీ రేంజ్ మారిపోతుంది..అతి తక్కువ సమయం లోనే సెలెబ్రేటి అయిపోవడం పక్కా..చుద్దాము ఏమౌతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: