వైరల్ : కలెక్టర్ మాస్ డాన్స్ కి.. అందరూ షాక్?

praveen
ఎవరి లో ఎలాంటి టాలెంట్ దాగి ఉంది అని చెప్పడం దాదాపు అసాధ్యం అని చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు ఎంతో కామ్ గా కనిపించిన వారు కొన్ని కొన్ని సార్లు ఊహించని రీతిలో టాలెంట్ కలిగి ఉంటారు అన్న విషయం తెలిసిందే. వారి టాలెంట్ చూసినప్పుడు ఫిదా అవడం ప్రతి ఒక్కరి వంతు అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. సాధారణంగా కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఎంతో హుందాగా కనిపిస్తూ ఉంటారు. అన్ని ఎమోషన్స్ ని లోపలే దాచుకుంటూ ఎంతో గంభీరంగా కనిపించడం కూడా చేస్తూ ఉంటారు.

 కానీ ఇలా ఎంతో హుందాగా నడుచుకునే కలెక్టర్  కూడా సమయం సందర్భం వచ్చినప్పుడు జీవితాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తారు  అన్న దానికి సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ గా మారిపోయాయి. ఎప్పుడూ గంభీరంగా కనిపించే కలెక్టర్ నవ్వుతూ డాన్సులు చేయడం లాంటివి చేశారు అంటే అధిక కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. ప్రస్తుతం వినాయక నిమజ్జన వేడుకలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 ఈ క్రమంలోనే ఇటీవల గణేష్ నిమజ్జన వేడుకలలో ఖమ్మం కలెక్టర్ గౌతమ్ రెడ్డి మాస్ స్టెప్పులతో దుమ్ము లేపాడు. కలెక్టర్ డాన్స్ చూసి అక్కడున్న వారందరూ కూడా అవాక్కయ్యారు అని చెప్పాలి. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిమజ్జనానికి ముందు జరిగిన ఊరేగింపులో డీజే పెట్టి డాన్సులు చేశారు. ఈ సమయంలోనే కలెక్టర్ గౌతంరెడ్డి త్రిబుల్ ఆర్ సినిమా లోని నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. వామ్మో మనందరికీ తెలిసిన కలెక్టర్ లో ఇంత బాగా డాన్స్ చేసే టాలెంట్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: