ఒళ్ళు గగుర్పొడిచే యాక్సిడెంట్.. క్షణాల్లో అగ్నికి ఆహుతి?

praveen
ఇటీవల కాలం లో  ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకి అటు వాహనాల సంఖ్య ఎలా పెరిగిపోయిందో అలాగే రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరిగిపోతుంది అని చెప్పాలి. వెరసి  రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. కొంతమంది ఏకంగా రోడ్డు ప్రమాదాలతో జీవచ్ఛవాలుగా మారిపోతూ ఉంటే మరికొన్ని చోట్ల రోడ్డు ప్రమాదాల కారణంగా కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది అనే విషయం తెలిసిందే.

 ఇలా రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటివరకు వైరల్ గా మారిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒళ్ళు గగుర్పొడిచే వీడియోలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. క్షణకాల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదానికి గురైన వాహనాలు అగ్నికి ఆహుతి గా మారిపోయాయి. ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో రోడ్డు ప్రమాదం చూసిన తర్వాత నెటిజన్లు అందరూ కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి.

 అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హిల్స్ ఏరియాలో ఘటన జరిగింది. వేగంగా దూసుకు వచ్చిన మెర్సిడెస్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది  అయితే ఈ ఘటనలో ఒక గర్భిణీ మహిళ ఏడాది వయసున్న చిన్నారి తో పాటు ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా రోడ్డు ప్రమాదం జరిగే సమయంలో పెద్దఎత్తున మంటలు చెలరేగడం గమనార్హం. ఒకసారి ఈ వీడియోలో చూసుకుంటే ఎప్పటిలాగానే ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ అన్ని వాహనాలు స్లో గా వెళ్తున్నాయి. ఇలాంటి సమయంలో దూసుకు వచ్చింది ఒక కారు. ముందున్న వాహనాలు ఢీ కొడుతూ దూసుకుపోయింది. ఈ క్రమంలో క్షణాల్లో భారీగా మంటలు చెలరేగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: