ఎర్ర చీమలతో చట్నీ ఎప్పుడైనా చూశారా?..అక్కడ అదే డిమాండ్..!

Satvika
ఎర్ర చీమలు పేరు వినగానే కుడితే మంట అని భయ పడతారు..కానీ ఓ ప్రాంతంలో మాత్రం ఎర్ర చీమల పేరు వినగానే నోట్లో నీళ్ళు ఊరతాయని అంటున్నారు.. ఏంటి ఈ విడ్డూరం అనుకుంటున్నారా..అవును మీరు విన్నది అక్షరాల నిజం అనే చెప్పాలి..మాములుగా ఇడ్లీతో పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ అదిరిపోయే కాంబినేషన్‌.. పొంగిన పూరీలోకి బొంబాయి చట్నీ కేక పుట్టిస్తుంది.

అది ఎందులోకైనా పర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌. మీరు కరెక్ట్‌గానే విన్నారు.. అది చీమల చట్నీయే.ఒడిశా, చత్తీస్‌గఢ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎర్రచీమల చట్నీ బాగా ఫేమస్.ఈ చట్నీ మన శరీరానికి ఓ ఔషధంగానూ పని చేస్తుందట. అందుకే దీనికి జీఐ ట్యాగ్‌ కోసం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎర్ర చీమల చట్నీ జ్వరం, జలుబు, దగ్గు, ఆకలిని తగ్గించడానికి, కంటి చూపు, కీళ్ల నొప్పులు మరియు ఆరోగ్యకరమైన మెదడును మెరుగుపరచడంలో సహాయపడుతుందని కేంద్రానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త దీపక్ మొహంతి తెలిపారు..

ఒడిశాలోని మయూర్‌భంజ్‌లోనూ.. ఎక్కువగా ఈ చీమల చట్నీకి డిమాండ్‌ ఉంది. మనమైతే చీమల్ని చూడగానే..దూరం జరగడం కానీ, ఊడ్చేయడం గానీ చేస్తుంటాం. కానీ గిరిజనులు మాత్రం చీమల్ని చూడగానే పండుగ చేసుకుంటారు. వెంటనే వాటిని సేకరించి పచ్చడి చేసేసుకుంటారు. ఈ ఎర్రచీమల పచ్చడిని స్థానికంగా చాప్‌ డా అని పిలుస్తుంటారు..మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అడవుల్లోని సర్గీ, సాల్, మామిడి ఆకులపై ఎర్రచీమలు గూళ్లు పెడతాయి. స్థానిక గిరిజనులు ఆ చెట్లెక్కి, ఈ చీమలను సేకరిస్తారు. ఈ చట్నీ తయారుచేసేందుకు ముందుగా వాటిని రుబ్బుతారు. ఆ పేస్ట్‌కు ఉప్పు, కారం కలిపితే చట్నీ సిద్ధమవుతుంది. కొందరు అల్లం, వెల్లుల్లి కూడా కలుపుతారు. అక్కడి వారంతా ఈ చీమల చట్నీని ఎంతో ఇష్టంగా తింటారు. నిజానికి కీటకాలను తినే అలవాటు తరాల నుంచీ ఉంది..ఇప్పుడు ఈ చీమల ట్యాగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి..అది కనుక వస్తే వరల్డ్ వైడ్ తెగ ఫేమస్ అవుతూంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: