ఇలాంటి కారంపొడిని ఎప్పుడైనా చూశారా?

Satvika
కారం పొడి అనగానే అందరికి ఎరుపు రంగు కళ్ళ ముందు కనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో ఇంత కారంపొడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆఁహా ఆ రుచి వేరని చెప్పాలి. ముఖ్యంగా మాంసము కూరలలో కారం లేదని ముక్క తినాలని అనిపించదు. ఎంత కారం వేస్తే అంత ఎర్రగా కూర ఎర్రగా ఉంటుంది.ఎరుపు రంగులోనే కాకుండా పచ్చ కలర్ లో కూడా మనకు అందుబాటులోకి రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. అంటే ఎర్ర మిరపకాయలతో చేసె కారం పొడి ఎర్రగా ఉంటుంది. అయితే ఇప్పుడు పచ్చి మిరపకాయలతో చేస్తున్న కారంపొడి ఆకు పచ్చని రంగులో ఉంటుందని క్లియర్ గా అర్థమవుతోంది..


ఇది వినడానికి వింతగా వుంది కదూ.. అవును మీరు విన్నది అక్షరాల నిజం అని చెప్పాలి..విషయాన్నికొస్తే.. యూపీలోని వారణాసికి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ వారు ఈ పచ్చిమిర్చితో కారం పొడిని తయారుచేస్తున్నారు. ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసే క్రమంలోనే ఈ రకం పచ్చి మిర్చి కారం పొడిని వెలుగులొకి తీసుకొచ్చింది. ఆ పొడి గురించి అందరికి వివరించింది.మార్కెట్ లోకి రాక ముందే డిమాండ్ భారీగా పెరిగిందని వారు తెలిపారు. ఇకపోతే మరి కొద్ది రోజుల్లో ఈ పచ్చరంగు కారం పొడిని మార్కెట్ లోకి తీసుకురావాలని ప్లాను చెస్తున్నారు..


ఇప్పటికే ఈ కారానికి సంబంధించిన హక్కులను కూడా పొందినట్లు ఆ సంస్థ పెర్కొంది..ఈ కారం పొడిని చాలా నెలల వరకూ నిల్వ ఉంచుకోవడానికి వీలుగా ఉంటుందని అధికారులు తెలిపారు...ఇకపోతే ఈ ఆకు పచ్చని కారంపొడిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు ఒకసారి చుద్దాము..పచ్చిమిరపకాయలను సేకరించి ఒక ప్రత్యేక పద్ధతుల్లో వాటి యొక్క రంగు పోకుండా ఎండబెట్టి ఈ పచ్చకారం పొడిని తయారు చేస్తారు. అంతేకాకుండా ఈ పచ్చకారం చాలా కారంగా, ఘాటుగా ఉంటుంది. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. ఈ కారం పొడిని ఆహారంలో ఉపయోగించడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుందని నిపుణులు అంటున్నారు.. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఎర్ర కారంపొడితో పోలిస్తే ఇలాంటి కారపు పొడిలో రోగనిరోధక శక్తి ఎక్కువగానే ఉంటుంది..మార్కెట్ వీటికి మంచి డిమాండ్ కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: