"రెండు ముక్కలుగా విరిగిన విమానం"... పెద్ద ప్రమాదం తప్పింది?

VAMSI
ల్యాండ్ అవుతూ అదుపు తప్పిన విమానం, కళ్లముందే విమానం రెండు ముక్కలు అవడంతో షాక్, అసలు ఏం జరిగిందంటే. గురువారం కోస్టారికాలో ఓ కార్గో ప్లేన్ అత్యవసర ల్యాండింగ్ చేస్తూ రెండుగా ముక్కలయింది. శాన్ జోస్ లో ఉన్నటువంటి జువాన్ శాంటా మారియా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఒక పసుపు రంగు బోయింగ్-757 విమానం బయలు దేరింది. అయితే సాంకేతిక లోపం వలన అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి రాగా 25 నిముషాలకే వెనుతిరిగింది. ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానం నుండి మొదట పొగలు వెలువడి హఠాత్తుగా విమానం ఆగిపోయింది. అదే సమయంలో రన్‌వే నుండి పక్కకు జారి రెండు భాగాలుగా విరిగి పోయింది ఆ విమానం.
ఉదయం 10:30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ప్రయాణికులు ఎవరు లేకపోవడం సంతోషించదగ్గ విషయం. ప్రమాదం జరిగిన సమయంలో కేవలం ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారు. వారు కూడా క్షేమంగానే ఉన్నారని సమాచారం. ఈ విషయాన్ని కోస్టారికా అగ్నిమాపక సిబ్బంది చీఫ్ హెక్టర్ చావెస్ వెల్లడించారు అయితే ముందు జాగ్రత్త కోసం వారిని ప్రస్తుతం వైద్య పరీక్షలకు పంపినట్లు తెలిపారు. ఈ ప్రమాదం హైడ్రాలిక్ సమస్య కారణంగా జరిగిందని తెలుస్తోంది. ఏదేమైనా పెను ప్రమాదం తృటిలో తప్పిందనే చెప్పాలి. విమానం నుండి పొగలు వెలువడినప్పటికీ మంటలు చెలరేగలేదు, లేదంటే పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది అని అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అంతే కాకుండా విమానంలో ఉన్న ఇద్దరు సిబ్బంది కూడా సేఫ్ గా ఉండటం తో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం జరగడంతో సాన్ జోస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసి వేశారు అక్కడి అధికారులు. ఈ ప్రమాదం ప్రపంచం లోని అందరూ తెలుసుకుని ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: