ఉగాది పండుగ చరిత్ర ఏమిటో తెలుసా..?

Divya
దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన హిందువుల పండుగలలో ఉగాది కూడా ఒకటి. ఈ ఉగాదితో ఈ రాష్ట్రాల కి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అగస్య ఆది ని ఉగాది అంటారు.. ఉగా అంటే నక్షత్రం యొక్క గమనం.. దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థమట. వేదాలను హరించిన సోమకుని చంపి మృత్య అవతారంలో విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పజెప్పిన తరుణంలో ఉగాది ఆచరణలోకి వచ్చినట్లుగా పురాణాలలో తెలుపబడింది.
చైత్రశుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినాడు కనుక ఆ రోజున ఉగాదిగా జరుపుకుంటారు అని కూడా చెప్పబడింది. శిశిర ఋతువు ,ఆకురాలుకాలం శిశిరం తరువాత వసంతం వస్తుంది కనుక ఆ రోజున కూడా ఉగాది రోజే అని తెలుగు సంవత్సరం మొదలవుతుంది అని పూర్వం నుంచి వస్తూనే ఉంది. అందుచేత ఆ రోజున పనులు ప్రారంభిస్తారు ప్రతి ఒక్కరూ. ఉగాది పండుగ రోజున ఉదయం లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తూ ఉంటారు. అటు తరువాత తల స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడి తో ఉగాదిని ప్రారంభిస్తారు.
ఉగాది పచ్చడి ఈ పండుగకు చాలా ప్రత్యేకమైనది. షడ్రుచుల సమ్మేళనం.. ఉప్పు, తీపి, పులుపు, చేదు కారం, వగరు  ఇలా అన్ని ఆరు రుచులను కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఈ పచ్చడి కోసం మామిడి కాయలు ,ఉప్పు కారం ,చింతపండు, బెల్లం, వేపపువ్వు వంటివి వాడుతూ ఉంటారు. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వంటి ప్రాంతాలలో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. మహారాష్ట్రలో గుడిపాడు అనే పేరుతో తమిళులు పుత్తాండు అనే పేరుతో మలయాళీలు విషు అనే పేరుతో ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరపడం ఆనవాయితీగా వస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: