శ్రీవారి భక్తులకు శుభవార్త.. కారణం ఏమిటంటే..!!

Divya
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు ఒక గుడ్ న్యూస్ తెలియజేస్తోంది.. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను ఈ రోజున ఆన్లైన్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణం గా నిలిచిపోయిన ఈ టికెట్లు రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి శ్రీవారి సేవలకు భక్తులను అనుమతించ బోతున్నట్లుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇలాంటి సమయంలోనే ఏప్రిల్ నెల, మే జూన్ వరకు సంబంధించిన సేవలను కూడా విడుదల చేయడం జరిగినట్లు తెలుస్తోంది. వీటిని టీటీడీ అధికారిక వెబ్ సైట్ లోనే ఉంచినట్లుగా భక్తులకు తెలియజేయడం జరిగింది.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రావాలని అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటల నుండి  టికెట్లను విడుదల చేసినప్పటికీ కూడా సర్వర్ లోపం కారణంగా టికెట్లు సరిగ్గా బుక్ కావడం లేదు. ఈ సైట్ తెరుచుకోకపోవడంతో భక్తులు చాలా నిరాశకు చెందినట్లుగా తెలుస్తోంది. ఇటువంటి ఇబ్బందులు మళ్లీ తలెత్తకుండా చూడాలని అధికారులను భక్తులు కోరుతున్నారు. ఇక శ్రీవారి భక్తులకు..www.tripatibalaji.ap.gov.in అనే వెబ్ సైట్ లో టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలియజేశారు.

అయితే టిటిడి ఇదివరకే తెలిపిన ప్రకారం సుప్రభాతం, తోమల, అష్టదళ పాద పద్మారాధన, నిజపాద, అర్చన దర్శనం టికెట్లను ఆన్లైన్లోనే కేట ఇస్తారట. ఈ సేవలకు ఈరోజు ఉదయం 10 గంటల నుండి మార్చి 22 వ తేదీ ఉదయం 10 గంటల వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి వాటిని నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ఇక టికెట్లు పొందిన వారి జాబితాను మార్చి 22వ తేదీన తెలియజేస్తామని అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే టికెట్లు పొందిన భక్తులు కేవలం రెండు రోజుల్లోనే వాటి ధారణ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఉగాది ఇది పండుగ సందర్భంగా, ఏప్రిల్ 10వ తేదీన శ్రీ రామారావు సందర్భంగా కొన్ని సేవలు ఉంటాయని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: