అసలు హోళి పండుగ విశిష్టత ఏమిటో తెలుసా..?

Divya
అసలు హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు.. హోలిక అని దేనిని అంటారో ఇప్పుడు తెలుసుకుందాం. సంవత్సరంలో కేవలం ఒక్క సారి మాత్రమే ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. ఈ పండుగను సత్య యుగం నుంచి జరుగుతున్నట్లుగా హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. హోళి అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ హోళిని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. పాల్గొన్న మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీని జరుపుకుంటారు.

అసలు హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే.. అందుకు ఒక ఇతిహాసం ఉన్నదట. పూర్వము రాక్షస రాజు.. హిరణ్యకశ్యపుడు ..  కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు.. అది హిరణ్యకశ్యపుడికి నచ్చదు దీంతో భక్త ప్రహ్లాదుని చంపేయాలి అనుకుంటాడు. తన సోదరి అయిన హోలికను పిలుస్తారు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుని మంటలలో ఆహుతి చేయమని ఆమెను కోరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని, మంటల్లోకి దూకుతుంది. విష్ణు మాయ తో ప్రహ్లాదుడు బయటపడతాడు. హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చిక్కుకొని చనిపోతుందట. ఇక ఆమె దహనమైన రోజునే హోళి అని పండుగను పిలుస్తారని ప్రచారంలో ఉన్నది.
అందుచేతనే కొన్ని ప్రాంతాలలో రాత్రి సమయాలలో హోళికా దహనం చేస్తూ ఉంటారు. పూర్వం ఈ పండుగ రోజున రకరకాల పూలను ఒకరిపై ఒకరు చల్లుకునే ఉండేవారు అలా వారి యొక్క సంతోషాన్ని పంచుకుంటూ ఉండేవారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పూల స్థానంలో రకరకాల రంగులు వచ్చాయి. ఈ రంగులను నీళ్ళలో కలుపుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్రేమ తో పాటు, సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి అని అందరూ భావిస్తారు. ఇక అప్పట్లో శ్రీకృష్ణుడు గోపికలతో కలసి బృందావనంలో పువ్వుల తో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకునేవారు. ఇలా చేయడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: