కేదార్నాథ్ ఆలయం తెరుచుకునేది అప్పుడే..!!

Divya
భారతీయ ప్రజలు అత్యంత పవిత్రమైనవిగా భావించే హిందూ దేవాలయాలలో కేదారనాథ్ దేవాలయం కూడా ఒకటి. అయితే ఈ యాత్రకు సంబంధించి ఉత్తరాఖండ్ దేవాదాయ శాఖ అధికారులు కొన్ని విషయాలను తాజాగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈ ఏడాది కేదార్నాథ్ ఆలయాన్ని మే 6వ తేదీన ఉదయం 6:25 నిమిషాలకు తెరవనున్నట్లు తెలియజేశారు. ఇక అదే విధంగా బద్రీనాథ్ ఆలయాన్ని కూడా మే నెలలోనే 8వ తేదీన తెరవడం ఉన్నట్లు తెలియజేశారు. ఇక 3వ తేదీన యమునోత్రి, గంగోత్రి తృతీయ రోజున తెరవనున్నారు.

మహాశివరాత్రి వేడుక సందర్భంగా ఓంకారేశ్వర ఆలయంలో చేపట్టి న పూజా కార్యక్రమాలతో పరమ శివుడిని పూజించడం జరిగినదని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. పురాణాల ప్రకారం ఈ ఆలయం పాండవుల చేత నిర్మించబడినది. కేదార్నాథ్ ఆలయం శివుడికి అంకితం చేయబడిన 12 జ్యోతిర్లింగాలలో ఇది కూడా చాలా ప్రధానమైనది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే సుమారుగా 16 కిలోమీటర్ల మేర వరకు హిమాలయ పర్వతాలపై నడవవలసి ఉంటుంది. కేవలం చలికాలంలో ఈ ఆలయాన్ని మూసి.. తిరిగి వేసవి కాలంలో ఈ ఆలయాన్ని ప్రారంభిస్తారు. ఇక మే నెల నుంచి అక్టోబర్ నెల వరకు కేదార్నాథ్ ఆలయం తెరిచి ఉంటుంది. ఇక వచ్చే భక్తులకు కొన్ని సూచనలు ఇవ్వడం కూడా జరిగింది వాటి గురించి చూద్దాం.
కేదారనాథ్ కు ప్రయాణించే భక్తులకు ఫోటో మెట్రిక్ రిజిస్ట్రేషన్ అవసరం. ఈ పని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో కూడా చేయబడుతుందట. ఇది చేయించుకోవడం వల్ల అత్యధిక సమయాలలో.. యాత్రికులను గుర్తించుకోవడానికి ఉపయోగపడుతుందట.
ఇక అంతే కాకుండా కోవిడ్ కారణంగా గత సంవత్సరం యాత్రకు అనుమతించడం జరగలేదు..సాధారణంగా ఈసారి భక్తుల సంఖ్య ఎక్కువగా పెరుగుతుందని భావించడంతో అధికారులు ఇటువంటి పరిమితులు ఉంటాయి అని తెలియజేశారు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మెడికల్ సర్టిఫికేట్ తీసుకురావాల్సిందిగా తెలియజేశారు. ఇవన్నీ తీసుకొని వెళితే అక్కడికి వెళ్లనిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: