ఒంగోలు లో భారీ అగ్నిప్రమాదం..9 బస్సులు దగ్ధం..!!

Divya
తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.. వుడ్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న కావేరీ ట్రావెల్స్ బస్ పార్కింగ్ స్టాండ్ లో అనుకోకుండా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనుకోకుండా అక్కడే ఉన్న తొమ్మిది బస్సులు అగ్నికి ఆహుతి అవ్వడం గమనార్హం. అలాగే పక్కనే ఉన్న మరో రెండు బస్సులకు కూడా మంటలు వ్యాపించడంతో ఎంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ పార్కింగ్ స్టాండ్ లో సుమారుగా 20 కి పైగా బస్సులు ఉండటం ఒక బస్సు నుంచి ఇంకొక బస్సుకు అగ్ని వ్యాపించడం అంతా క్షణం లో జరిగి పోయింది.
ఇక కొంతమంది  నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మిగిలిన బస్సులను అక్కడి నుంచి తరలించేందుకు యాజమాన్యం ప్రయత్నించగా ఇంకా అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ బస్సులను కూడా ప్రైవేటు బస్సులు కావడం గమనార్హం. ఇకపోతే మంటల ధాటికి దట్టమైన పొగలు చుట్టుపక్కల అంతా వ్యాపించడంతో అక్కడున్న ప్రజలు అంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురి అయ్యారు. ఇక వెంటనే అక్కడి ఉన్న ప్రయాణికులను కూడా పంపించడానికి యాజమాన్యం ఎంతో ప్రయత్నం చేసింది.
కానీ అదృష్టవశాత్తు బస్సులో ప్రయాణికులు లేకపోవడం గమనార్హం. అయితే చెలరేగుతున్న మంటలను అదుపు చేయడానికి సిబ్బంది శాయశక్తులా శ్రమిస్తున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు అక్కడ అక్కడ జరుగుతున్న యాజమాన్యం మాత్రం భయాందోళనలకు గురి అవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వానికి ఆస్తి నష్టం కలగకపోయినా ప్రైవేట్ బస్సులన్నీ దగ్ధం అవ్వడంతో సర్వీసులు యాజమాన్యం కారణాలను వెంటనే తెలియజేయాలని అధికారులను కోరుతున్నారు. ఇకపోతే సడన్గా ఇలా మంటలు చెలరేగడంతో అక్కడున్న ప్రయాణికులంతా భయాందోళనకు గురవుతున్నారు బస్సు ప్రయాణం సేఫ్టీ అనుకునే ఎంతోమంది ఇలా ఈ సంఘటన చూసి చాలా భయపడిపోతున్నారు. ఏం జరిగినా అక్కడ ప్రయాణికులకు ఏమీ నష్టం కలగలేదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: