రైల్వే స్టేషన్ లో అగివున్న రైలులో మంటలు.. ఎక్కడంటే..!!

Divya
 బీహార్ లో తాజాగా ఒక పెను ప్రమాదం తప్పిపోయింది.. మధుబని రైల్వే స్టేషన్లో ఈ రోజున ఉదయం ఆగి ఉన్న రైలు లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పోయాయి.. అయితే అక్కడుండే పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ఢిల్లీ నుంచి వస్తున్న ఫ్రీడమ్ ఫైటర్ ఎక్స్ప్రెస్ రైల్లో నుంచి మంటలు వెలువడ్డాయి.. అలా వెలువడిన కొద్దిసేపటికే మంటలు పెరిగి రైలు భోగి వైజ్ గా మంటలు పెరుగు కుంటూ వెళ్లడం ప్రారంభించాయి. అదృష్టవశాత్తు రైలులో మంటలు చెలరేగిన అప్పుడు ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో త్రుటిలో నుంచి ప్రమాదం తప్పిందని సిబ్బంది తెలియజేశారు.
ఇక అక్కడ ఉన్న రైల్వే సిబ్బంది.. మరికొంతమంది ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.. అగ్ని మాపక సిబ్బంది కి సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేయడం జరిగిందట. అయితే అలా రైలు ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నది. అయితే స్థానిక మీడియా కథనాల ప్రకారం అక్కడికి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఆ రైలును పార్కు చేయడం జరిగిందట. ఇక పార్కు చేసినప్పుడు ఆ బోగీలో నుంచి మంటలు చెలరేగడంతో రెండు భోగిలు కాలిపోయాయి అని సమాచారం.
ఇక సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. ఈ విషయం ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారి వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం 9 గంటల 13 నిమిషాలకు సమస్తిపూర్ డివిజన్ లోని మధుబని రైల్వే స్టేషన్ లో ఉన్న రైలులో నుంచి మంటలు చెలరేగాయని తెలియజేశారు. ఆ సంఘటన చూసి వెంటనే చర్యలు తీసుకొని మంటలను 9:50 నిమిషాలకు ఆర్పి వేశామని తెలియజేశారు. అయితే ఈ ఘటన స్థలంలో ఎలాంటి అపాయం జరగలేదని తెలియజేశారు. ఈ ఘటన ఎలా జరిగిందో Rpf అధికారులు త్వరలోనే తెలియజేస్తాం అని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలపడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: