వైరల్ : 'త్రినయని' సీరియల్ హీరోయిన్ డాన్స్.. భలే చేసింది?

praveen
ఒకప్పుడు సినిమాల్లో నటించే నటీనటులకు మాత్రమే ఎక్కువగా క్రేజ్ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తున్న వారికి కూడా అంత కంతకు క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని యాక్టర్స్ కి  ఆడియన్స్ కి మధ్య  దూరం బాగా తగ్గిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం తమ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి తమలోని కొత్త టాలెంట్ని నిరూపించుకోవడానికి ఎంతోమంది నటీనటులు సోషల్ మీడియానే తమ ఆయుధంగా ఎంచుకుంటున్నారు.

 సోషల్ మీడియా ద్వారా కొన్ని వీడియోలు చేయడం.. ఇక ఆ వీడియోలు అభిమానులను తెగ ఆకర్షించడం.. దీంతో ఇక నటీనటులకు ఫాలోయింగ్ కూడా బాగా పెరిగి పోవడం లాంటివి జరుగుతుంది. ఇలా ఈ మధ్యకాలంలో ఎంతోమంది సీరియల్ లో నటించే వాళ్ళు సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అవుతున్నారు. అయితే జీ తెలుగు లో ప్రసారమయ్యే త్రినయని సీరియల్ గుర్తుంది కదా. ప్రస్తుతం ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సీరియల్. సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన నటి ఆషిక పదుకొనే. అంతకుముందు కథలో రాజకుమారి అనే సీరియల్ లో నటించిన ఈ అమ్మడు ఇక ఇప్పుడు త్రినయని అనే సీరియల్లో లీడ్ రోల్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవుతుంది.

 ఇక ఆశీక పదుకొనే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. ఇక అప్పుడప్పుడు తన ఫోటోలను వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తు ఉంటుంది ఈ అమ్మడు. ఇటీవలే ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఒక తమిళ పాటకి అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది ఆషిక. ఇక ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఒక చిత్రమైన కామెంట్ కూడా పెట్టింది. పోస్ట్ చేయాలి అనిపించింది అందుకే చేశాను కానీ ఆ తర్వాత డిలీట్ కూడా చేయవచ్చు అంటూ ఇక ఈ వీడియోకి  ఒక వాక్యం జత చేసింది  ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో మందిని ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: