షాకింగ్.. తినే పిజ్జాలో నట్స్, బొల్ట్స్..

Purushottham Vinay
పిజ్జా ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇదంటే ఇష్టం లేని వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఇక ప్రముఖ ఫుడ్ చెయిన్ కంపెనీల నుంచి చిన్న బేకరీల వరకు కూడా ప్రతి చోటా పిజ్జాలను అమ్ముతారు. ప్రతి ఒక్కరూ కూడా తమ ఇష్టాలకు తగినట్లు దీన్ని తయారు చేసుకొని తింటారు. పిజ్జాతో పాటు నచ్చిన టాపింగ్స్‌, పిండి ఇంకా సాస్ వంటివన్నీ కూడా కస్టమర్లు ఎంచుకోవచ్చు. అయితే ఆ టాపింగ్స్ అనేవి మాత్రం కేవలం తినగలిగేవి అయితే సరిపోతుంది కానీ తినేందుకు వీలు కాకుండా నట్స్ ఇంకా బోల్ట్స్ వంటివన్నీ పెడితే ఇక ఎలా ఉంటుంది? ఇలాంటి షాకింగ్ అనుభవమే ఎదురైంది బ్రిటన్‌ దేశానికి చెందిన మిస్ బార్టన్ అనే మహిళకు..ఇక అలాగే వివరాల్లోకి వెళ్తే.. జులై 29 వ తేదీన బ్రిటన్‌లోని థార్న్ టన్ క్లీవ్లేస్ దగ్గర్లోని ఫ్లీట్ వుడ్ రోడ్‌లో ఉన్న డొమినోస్‌ ఫుడ్ బేకరీలో పిజ్జాను ఆర్డర్ చేసింది బార్టన్. టేక్ అవే తీసుకెళ్లిన ఆమె కొద్ది దూరం వెళ్లిన తర్వాత పిజ్జా తినడానికి ఆ కవర్ ఓపెన్ చేయడం జరిగింది.అయితే ఆ పిజ్జాపై విచిత్రంగా నట్లు, బోల్టులు వంటి ఇనుప వస్తువులు కనిపించడంతో ఆమె దెబ్బకి షాక్ అయింది. దీంతో ఆ పిజ్జాకు సంబంధించిన ఫొటోలని తీసి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. దీనికి సదరు డొమినోస్ అవుట్‌లెట్‌తో పాటు మీడియాను కూడా ట్యాగ్ చేయడం జరిగింది. ఇక తన డబ్బు రిఫండ్ చేయాలని ఆమె అడిగింది.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అయ్యాయి. ఇక దీంతో డొమినోస్ అవుట్ లెట్ ఆమెకు సారి చెప్పడం జరిగింది.అలాగే ఆ పిజ్జాకు చెల్లించిన డబ్బును కూడా రిఫండ్ చేయడం జరిగింది. ఇక పిజ్జాను ఇలా నిర్లక్ష్యంగా తయారు చేసినందుకు నెటిజన్లు కోపాన్ని చాలా తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో బార్టన్ షేర్ చేస్తూ "ప్లీజ్ ప్లీజ్.. మీరు పిజ్జాలు తయారుచేసి అమ్మేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. పిజ్జాను ఇష్టపడేవాళ్లు కూడా వాటిని తినేముందు ఓసారి చెక్ చేసుకోవడం మంచిది.నేను లేక నాలాంటి వాళ్లు ఎవరైనా ఇలా నట్లు ఇంకా బోల్టులతో ఉన్న పిజ్జాను తప్పకుండ తిని ఉంటారనే ఆలోచనే నన్ను తెగ భయపడుతోంది. ఇకపై డొమినోస్ పిజ్జా ఆర్డర్ చేసే ముందు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ పోస్ట్ ని తప్పకుండా షేర్ చేయండి.ఇలాంటి సమస్య తప్పకుండా ఇంకెవరికైనా ఎదురు కావచ్చు" అని ఆమె రాసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: