వీడియో : అలా చేసిందని.. విమానంలో మహిళని కట్టేసిన సిబ్బంది?

praveen
సాధారణంగా విమాన ప్రయాణం అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి  ఏం కావాలన్నా కూడా నిమిషాల్లో తెచ్చేందుకు  సిబ్బంది ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. చిన్న ఇబ్బంది ఇబ్బంది కలగకుండా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను చూసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం విమానంలో ప్రయాణిస్తున్న ఒక మహిళను ఏకంగా సిబ్బంది ఒక సీటుకు కట్టేశారు. కనీసం ఎక్కడా కదలడానికి వీలు లేకుండా మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా విమానంలో ఒక సీట్ కి టేప్ తో కట్టి వేశారు సిబ్బంది. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 ఇంతకీ ఆ సిబ్బంది ఎందుకు ఆ మహిళ ప్రయాణికులరాలిని ఒక సీటుకు కట్టేశారు. అంత అవసరం ఏమి వచ్చింది అని అంటారా.. దీని వెనుక పెద్ద స్టోరీ ఉంది ఇటీవలే టెక్సాస్ నుంచి నార్త్ కరోలినాకు అమెరికా ఎయిర్లైన్స్ విమానం బయలుదేరింది. ఇంతలో అకస్మాత్తుగా ఓ మహిళ పిచ్చిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. వెంటనే విమానం నుంచి కిందకి దింపేయాలి అంటు పిచ్చి పిచ్చి అరిచింది. అయితే విమానం గంట ఆలస్యంగా బయల్దేరిందని గమ్యం చేరిన తర్వాత దింపివేస్తామంటూ సిబ్బందికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మతిస్థిమితం కోల్పోయినట్లుగానే మోహరించింది ఆ మహిళా. సుమారు గంట పాటు గట్టిగా అరుస్తూ విమాన ప్రయాణికులకు అక్కడ ఉన్న సిబ్బందిని ఇబ్బంది పెట్టింది.

 ఎంత మంచిగా చెప్పి చూసిన వినలేదు. చివరికి విమానం గాల్లో ప్రయానిస్తున్న సమయంలోనే విమానం డోర్ తెరిచేందుకు ప్రయత్నించింది  దీంతో అక్కడున్న సిబ్బంది మొత్తం హడలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సదరు మహిళను టేప్ తో ఒక సీటు కట్టేసారూ. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారిపోయింది. విమానంలో గమ్యస్థానానికి చేరిన తర్వాత   భద్రత సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ విమానంలో ప్రయాణించిన ఒక ప్యాసింజర్ ఎవరికి తెలియకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది  అయితే మహిళను దారుణంగా టేపుల తో కట్టేశారని కాస్త మర్యాదగా వ్యవహరించి ఉంటే బాగుండేదని  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: