కర్మ ఈజ్ బి... అంటే ఇదేనేమో.. పెళ్ళాన్ని మోసం చేస్తే ఏం జరిగిందో చూడండి?

praveen
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రస్తుతం ఎక్కడో జరిగిన ఘటనలు కూడా క్షణాల వ్యవధిలో అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలి పోతున్నాయి. నేటి రోజుల్లో కొన్ని వీడియోలు అందరిని ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని తెలియజేసేలా ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమందిని ఆలోచింపజేస్తున్నాయి. ఇక ఇటీవలే ఒక వీడియో వైరల్ గా మారి పోయి ఎంతో మందిని ఆకర్షిస్తోంది. ఇక ఇందులో  భర్త భార్యను మోసం చేస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి  అనే తెలియజేశారు.

 ప్రస్తుతం ఈ వీడియో కాస్త భార్యను మోసం చేస్తూ పరాయి మహిళలతో రహస్యంగా సంబంధాలు కొనసాగించే వారందరినీ ఆలోచింపజేస్తుంది. సాధారణంగా చాలామంది కట్టుకున్న భార్య ఉన్నప్పటికీ ఇతర మహిళలపై మనసు పడుతూ ఉంటారు. అయితే అలా చేయడం తప్పు అని తెలిసినప్పటికీ.. కొంతమంది మాత్రం ఆ ఏమవ్వదులే అనుకుంటూ ఉంటారు . అయితే భార్యకు తెలియకుండా వేరే మహిళతో సంబంధాలు మెయిన్టెయిన్ చేసినప్పటికీ.. పైన దేవుడు అనేవాడు ఒకడు చూస్తూ ఉంటాడు అన్న విషయాన్ని మాత్రం మర్చిపోతూ ఉంటారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పింది . ఇంతకీ ఈ వీడియో లో ఏముంది అని అనుకుంటున్నారా.


 ఒక వ్యక్తి హాయిగా తన గర్ల్ ఫ్రెండ్ తో రొమాంటిక్ మూడ్ లో ఉంటాడు. ఇక ఆ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ నిద్రలోకి జారుకోగానే పక్కనే ఉన్న మహిళలతో పులిహోర కలపడం మొదలుపెడతాడు. ఏకంగా సదరు మహిళకు బాడీ లోషన్ రాసి మసాజ్ కూడా చేస్తాడు. అంతేకాదు మధ్య మధ్యలో తన గర్ల్ ఫ్రెండ్ నిద్ర లేస్తుందా లేదా అనే విషయం కూడా గమనిస్తూ ఉంటాడు.  ఇక తన గర్ల్ ఫ్రెండ్ నిద్రలో మునిగిపోవడంతో.. పరాయి మహిళలతో తెగ ఎంజాయ్ చేస్తాడు.  కానీ ఆ తర్వాతే అసలు ట్విస్ట్ ఉంటుంది.  అప్పటివరకు ఇక అతని పులిహోర రాజా మాటలు అన్నీ విన్న సదరు మహిళ.. ఇక అతను నిద్రలోకి జారుకునే అతని గర్ల్ ఫ్రెండ్ కు ఒక పేపర్ మీద అప్పటివరకు జరిగిన విషయాలన్నింటినీ రాసి ఇస్తుంది. చివరికి సదరు యువకుడి గర్ల్ ఫ్రెండ్ అతన్ని చీ కొట్టి వెళ్ళిపోతుంది. అయితే భార్యను కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ మోసం చేస్తే దానికి ప్రతిఫలం ఇలాగే ఉంటుంది అని ఈ వీడియో చెప్పకనే చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: