వైరల్: ఈ బుడ్డోడు మామూలోడు కాదు...!

Suma Kallamadi
ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. పాట‌తో ల‌క్ష‌ల మందిని మెప్పించాడు
చిన్న పిల్ల‌లు ఏది చేసినా చాలా ముద్దుగా ఉంటుంది. వారు తెలియ‌క చేసినా.. అది మ‌న‌కు చాలా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంటుంది. ఒక్కోసారి వాళ్ల‌కు ఎవ‌రో చెప్పిన‌ట్టు ప‌నులు చేస్తుంటారు. దాంతో అవి మ‌న‌కు ఇబ్బందితో పాటు అప్పుడ‌ప్పుడు ఆనందాన్ని ఇస్తుంటాయి. ఇప్పుడు ఇదేకోవ‌లో ఓ చిన్నారి చేసిన ప‌ని అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.
ఇప్పుడు అస‌లే క‌రోనా వార్త‌లు వినివిని చాలా చిరాగ్గా ఉంటున్న స‌మ‌యంలో ఈ చిన్నారి వీడియో ప్ర‌తి ఒక్క‌రినీ న‌వ్విస్తోంది. దీంతో త్వ‌ర‌గానే సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ఇప్పుడు చాలా దేశాల్లో కరోనా కారణంగా బయటకు వెళ్లి కటింగ్ చేయించుకునే పరిస్థితి ఎవరికీ లేదు. ఇంట్లోనే చేయించుకోవాల్సి వస్తోంది. ఇక చిన్న పిల్లలను అయితే అస్స‌లు బయటకు తీసుకెళ్ల‌లేం. అందుకే ఈ వీడియోలో ఉన్న చిన్నారికి ఇంట్లోనే ఆ పని చేయిస్తున్నారు పేరెంట్స్‌
అయితే చాలామంది చిన్న పిల్లలు కటింగ్ చేస్తుంటే రకరకాలుగా ఫేస్ యాంగిల్స్ పెడుతుంటారు. అటు ఇటు కదిలిపోయి కట్ చేసేవారికి చెమటలు పట్టిస్తారు. ప‌క్క‌నుండే వారి ఓపిక‌ను ప‌రిశీలిస్తుంటారు. మరి ఈ పిల్లోడు చేస్తున్న పనికి భలే ముద్దు వచ్చేస్తుంది. ఈ వీడియోలో ఈ ముద్దులొలికే పిల్లవాడు ఎరుపు రంగు కుర్చీపై కూర్చున్న హేర్ కట్ చేయించుకోవడం కనిపిస్తుంది. అనుష్రుత్ అనే ఈ బుడ్డోడు తనకు క‌టింగ్ చేస్తున్న బార్బర్ తో మాట్లాడుతున్నాడు.
బుడ్డోడు ఏదో ఒక రాగం తీయ‌డంతో జుట్టు కత్తిరించేటప్పుడు నిశ్శబ్దంగా ఉండమని బార్డ‌ర్ కోరడంతో వీడియో ప్రారంభమవుతుంది. అనుశ్రుత్ హ్యారీకట్ పొందేటప్పుడు ఎబిసిడిని చెప్పడం ప్రారంభించాడు. అలా ఎబిసిడి పాట‌ను పూర్తి చేసిన తర్వాత అక్కడ ఉన్నవారు చప్పట్లు కొట్టి బుడ్డోడిని ప్రశంసిస్తారు. దీంతో చిన్నారి చాలా ఆనందిస్తాడు. చిన్నారి అంద‌మైన మాట‌ల‌కు మిలియన్ల హృదయాలు ఉప్పొంగి పోయాయి. చాలామంది ఈ వీడియోను చూసి కాస్త ఊపిరి తీసుకున్న‌ట్టు ఫీల్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: