స్ట్రాబెర్రీ బిర్యానీ అంటా.. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తారా..!

sravani
ప్రపంచం నలుమూలలా జరిగే విషయాలను చిటికెలో తెలుసుకునేందుకు ఒక్క ఇంటర్నెట్ ఉంటే చాలు. ఇంతకు ముందు మనకు తెలియని విషయాలను మాత్రమే ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి తెలుసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్ పట్టుకునే గంటలు తరబడి కూర్చోవడం వల్ల ప్రతి చిన్న విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో వింత వింత పోస్టులు చేస్తూ.. కొంతమంది నెటిజన్స్ చేత శబాష్ అనిపించుకుంటుంటే... మరి కొంత మంది తిట్లు తింటుంటారు. తాజాగా ట్విట్టర్ లో చేసిన ఒక పోస్టు కూడా క్షణాల్లో వైరల్ అయ్యింది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ కు చెందిన సాద్ అనే వ్యక్తి తాను చేసిన స్ట్రాబెర్రీ బిర్యానీ ను ఫోటోలు తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. దీనిని చుసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. ఇప్పుడు ఆయన పెట్టిన ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాద్ ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేసాడు.. 'మేము ఈ రోజు స్ట్రాబెర్రీ బిర్యానీ చేసుకున్నాం.. ఏ బిర్యానీ గురించి అందరూ ఏం చెప్తారో తెలుసుకోవాలనుకుంటున్నాను'.. అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు. దీనిని షేర్ చేసిన కొద్దీ గంటల్లోనే ఈ పోస్టు వైరల్ అయ్యింది. దీని గురించి నెటిజన్స్ లో కొంతమంది నెగిటివ్ గా చెప్తే.. మరికొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.
ఒక వ్యక్తి స్పందిస్తూ.. అసలు ఇలాంటి ఆహారం ఎందుకు తయారు చేస్తారు.. అని కామెంట్ చేసాడు. మరొక వ్యక్తి చికెన్ బర్గర్ తో ఐస్ క్రీమ్, న్యూటెల్లా బిర్యానీ వంటివి పాతవయ్యాయని ఇప్పుడు ఈ కాంబినేషన్ బెస్ట్ అని కామెంట్ చేసాడు. మరో వ్యక్తి స్పందిస్తూ.. నేను మొదట ఈ ఫోటో చూడగానే భయపడ్డాను. తర్వాత ఈ ఆహారాన్ని ఎందుకు తయారు చేసారా అని ఆలోచిస్తున్న అంటూ కామెంట్ చేసాడు. నెటిజన్స్ తో తిట్టించుకున్న మొత్తానికి స్ట్రాబెర్రీ బిర్యానీతో అతడు పాపులర్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: