ఆర్టిఫిషియల్ ఇంటినిజెన్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. ఈ ఏఐ అనేది ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందితే మాత్రం కొన్ని పనులు చాలా సులభంగా అవుతాయి. కానీ అత్యధికంగా డెవలప్ అయితే కొన్ని వర్గాల వారికి నష్టం తప్పదని నిపుణులు అంటున్నారు. ఐక్యరాజ్య సమితి చెబుతున్న వివరాల ప్రకారం జెండర్ స్నాప్ చాట్ 2025 ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళల ఉద్యోగాలు ప్రమాదంలో పడబోతున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. ఏఐ కారణంగా దాదాపుగా మహిళల ఉద్యోగాలు ప్రమాదంలో ఉంటాయని తెలియజేశారు. ఇందులో పురుషులకు 21 శాతం ఉద్యోగాలు ప్రమాదంలో ఉంటాయని తెలియజేశారు.
ఈ ఏఐ వల్ల డిజిటల్ లింగ అసమానత ఏర్పడుతుందని తెలియజేశారు. అయితే ఈ నివేదిక ప్రకారం భవిష్యత్తు లో మాత్రం మహిళలకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, కానీ ఏఐ డెవలప్మెంట్ కాలంలో మాత్రం ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుందని సూచించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శ్రామిక శక్తిలో మహిళలు 29 శాతం మాత్రమే ఉన్నారు. సాంకేతిక రంగంలో మాత్రం ఈ సంఖ్య 14% పడిపోయే అవకాశం ఉందని సూచించారు. సాంకేతిక రంగంలో సుస్థిరాభివృద్ధి సాధించాలి అంటే ఇంకా ఐదు సంవత్సరాలు మాత్రమే టైముంది. ఇందులో లింగ సమానత్వం ఒక ప్రధానమైన లక్ష్యం. ప్రపంచం మొత్తం అద్భుతమైన మార్పులు ఎదుర్కొంటుందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.
దీనిపై సరైన చర్యలు తీసుకుంటే మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూరుతుందని, 30 మిలియన్ల మంది మహిళలు తీవ్ర పేదరికం నుంచి బయటపడతారని, 42 మిలియన్ మంది మహిళలు కుటుంబాలకు ఆహార భద్రత నిర్ధారించవచ్చని తెలియజేసింది. మహిళలను నష్టపోకుండా ఉండాలి అంటే సాంకేతిక రంగంలో మహిళలకు సంబంధించి పెట్టుబడులు పెట్టాలని, సురక్షితమైన జాబ్ వాతావరణం కల్పించాలని ఐక్యరాజ్యసమితి తెలియజేస్తోంది. ఈ విధంగా చేస్తే మహిళలు ఉద్యోగాలు కోల్పోకుండా ఉంటారని పేర్కొన్నది.