బుల్లి పిట్ట: కేవలం రూ .15 వేలకే జియో ఎలక్ట్రిక్ బైక్..!
అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర ఫీచర్స్ మరియు ఆన్లైన్ బుకింగ్ ప్రాసెసింగ్ వంటివి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఆర్థికంగా కాకుండా ఆధునిక సాంకేతికను సైతం ఉపయోగిస్తున్నారట.. ఈ జియో ఎలక్ట్రిక్ బైక్ అందరిని ఆకర్షించేలా ఉంటాయట. ఇది వేగంగా నడిపేందుకు సహాయపడుతుందని ఈ ఎలక్ట్రిక్ బైక్లో లిథియం అయాన్ బ్యాటరీ ఉపయోగించబోతున్నారట. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందట. సిటీలలో ఇది మరింత ఉపయోగపడుతుంది..
జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ .15 వేల నుంచి 17వేల రూపాయల మధ్యలో ఉంటుందట ప్రస్తుతం ఉన్న మార్కెట్లో లభించే ఎలక్ట్రిక్ బైక్ ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువే. ఈ స్కూటర్ ను బుక్ చేసుకోవడానికి ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందట.. దగ్గరలో ఉండే జియో స్టోర్ లో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలియజేస్తున్నారు.. అయితే జియో ఎలక్ట్రిక్ బైక్ రిలీజ్ తేదీ విషయానికి వస్తే వచ్చే ఏడాది రీలీట్ చేయబోతున్నారు.. అయితే కంపెనీ ఇంకా అధికారికంగా ఎలాంటి తేదీని అయితే ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ విషయమైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.. మొత్తానికి జియో ఎలక్ట్రిక్ బైక్ మాత్రం సక్సెస్ అయ్యిందంటే ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుంది..