యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్?
నేటి రోజుల్లో చదువుకున్న వారి దగ్గర నుంచి చదువుకోని వారి వరకు అందరూ కూడా ఈలా మొబైల్ ఫోన్లో యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయడం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక ఇండియాను డిజిటల్ ఇండియా గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ ప్రభుత్వం ఏకంగా ప్రతి చోటా క్యూఆర్ కోడ్ అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే నేటి రోజులలో పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ దగ్గర నుంచి చిన్న టీ కొట్టు వరకు ప్రతి వరకు కూడా ఇలా క్యూఆర్ కోడ్లను వారి షాప్ దగ్గర పెట్టుకొని ఇక ఆన్లైన్ ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి యూపీఐ పేమెంట్స్ తో ఎంతోమందికి చిల్లర కష్టాలు తీరిపోయాయి అని చెప్పాలి.
అయితే యూకే వినియోగదారులకు ఎప్పటికప్పుడు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్బిఐ గైడ్లైన్స్ తీసుకువస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల యూపీఐ పేమెంట్ చేసే వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అందింది. ఎందుకంటే ఇలాంటి చెల్లింపుల్లో డెలిగేటెడ్ రూల్ ను తీసుకురాబోతున్నట్లు ఆర్బిఐ ప్రకటించింది దీని ద్వారా ఒక యూజర్ తన బ్యాంకు ఖాతా నుంచి కొంత లిమిట్ వరకు మరో వ్యక్తికి యూపీఐ లావాదేవీ చేసేందుకు అనుమతి ఇవ్వచ్చు. అందుకోసం సెకండరీ యూజర్కు యూపీఐ కి లింక్ చేసిన బ్యాంకు ఖాతా ఉండాల్సిన పనిలేదు. ఈ నిర్ణయంతో తమ బ్యాంకు ఖాతా నుంచి సొంత కుటుంబ సభ్యులు యూపీఐ లావాదేవీలు చేసే విధంగా వెసులుబాటు లభిస్తుంది అని చెప్పాలి.