HDFC అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్ న్యూస్.. ఇకపై ఆ సేవలు బంద్..?

Pulgam Srinivas
HDFC బ్యాంక్ ఖాతా దారులకు ఒక చిన్న వెసులు బాటును ఈ బ్యాంకు తొలగించింది. అదేమిటి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం. ఇంతకు ముందు మనం ఏ చిన్న లాభా దేవిని UPI ద్వారా చేసిన దానికి బ్యాంకు ద్వారా మెసేజ్ వస్తూ ఉండేది. ఉదాహరణకు ఒక రూపాయి , రెండు రూపాయలు , 99 రూపాయలు ఇలా ఎంత చేసిన బ్యాంకు నుండి మెసేజ్ వస్తూ ఉండేది. కాకపోతే ఇకపై అలాంటి వెసులు బాటు hdfc బ్యాంక్ ఖాతా దారులకు లేదు. కనీసం వంద రూపాయల కంటే ఎక్కువ UPI పేమెంట్స్ చేసిన సమయంలో మాత్రమే వారికి మెసేజ్ వస్తుంది.

అలాగే మీకు ఎవరైనా డబ్బులు పంపినా కూడా ఇది వరకు ఎంత పంపితే అంత మెసేజ్ వస్తూ ఉండేది. కానీ ఇకపై 500 రూపాయల కంటే ఎక్కువ డబ్బులను మీకు UPI ద్వారా పంపిస్తేనే hdfc బ్యాంక్ మెసేజ్ ను పంపిస్తుంది. ఇలా ఎందుకు చేస్తుంది అని అనుమానాలు మీకు వచ్చి ఉండొచ్చు. ఒక ట్రాన్సాక్షన్ ను చేసినప్పుడు మీకు కంపెనీ అనేది ఒక మెసేజ్ పంపడానికి వారికి ఒక పైసా నుండి మూడు పైసల వరకు ఖర్చు అవుతుంది. ఇలా అతి చిన్న లావాదేవీలు UPI ద్వారా భారతదేశంలో అత్యంత ఎక్కువగా జరుగుతూ ఉండడంతో ఆ ఖర్చులు తగ్గించుకోవడం కోసం hdfc సంస్థ ఇలాంటి కొత్త విధానాన్ని అమలు చేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ పద్ధతి జూన్ 25 వ తేదీ నుండి అమలు అయినట్లు సమాచారం. ఇకపై ఏదైనా చిన్న పేమెంట్ లు చేసిన తర్వాత మెసేజ్ వస్తుంది అని ఎదురు చూడకుండా మీ బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం మంచిది. అలాగే ఎవరైనా మీకు డబ్బులు పంపినా కూడా మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉండకుండా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: