బుల్లి పిట్ట: జియో, ఎయిర్టెల్ కు దెబ్బేస్తున్న బిఎస్ఎన్ఎల్..!

Divya
ఈమధ్య టెలికాం రంగ సంస్థలలో రీఛార్జి ప్లాన్స్ భారీగానే పెరిగిపోయాయి. ముఖ్యంగా జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా టెలికాన్ చార్జీలు సైతం పెంచడంతో ఇప్పుడు ఏకంగా అందరు చూపు ప్రభుత్వం రంగమైన బిఎస్ఎన్ఎల్ సంస్థ పైన పడినట్టు తెలుస్తోంది.. ముఖ్యంగా ప్రైవేట్ రంగ టెలికాం తో పోలిస్తే ప్రభుత్వ రంగ టెలికాం దొరకే నెలవారి త్రైమాసిక వార్షిక ప్లాన్లు చాలా తక్కువ ధరకే ఉన్నాయి. దీంతో బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకోవడానికి చాలామంది మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా నెలవారి కనీస చార్జీల ధరల పెరిగిన నేపథ్యంలో ఇన్కమింగ్ కాల్స్ కోసం కూడా మొబైల్స్ ఎక్కువగా బిఎస్ఎన్ఎల్ వాడుతున్నారట.

జులై మూడు నాలుగవ తేదీలలో జియో ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా వంటి సంస్థలు టారిఫ్ ధరలను ఒక్కసారిగా సవరించి పెంచేశారు. దీంతో ఈ అధిక ధరను భరించలేక చాలామంది యూజర్స్ బిఎస్ఎన్ఎల్ వైపుగా అడుగులు వేయడం జరిగింది. దీంతో బిఎస్ఎన్ఎల్ సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతూ వస్తోందట. ప్రతినెల సబ్స్క్రైబర్లను కోల్పోవడమే తప్ప బిఎస్ఎన్ఎల్ కొత్తగా చేర్చుకోవడం వంటివి ఇటీవల కాలంలో ఎక్కడ జరగలేదట. కానీ ఒకసారిగా ప్రైవేటు కంపెనీ టెలికాం రంగ సంస్థలు రీఛార్జి ప్లాన్స్ ను పెంచడంతో కనివిని ఎరుగని రీతిలో బిఎస్ఎన్ఎల్కు మంచి లక్కు కలిసి వచ్చింది.

గడిచిన రెండు వారాలలో సుమారుగా రెండున్నర లక్షల మందికిపైగా మొబైల్ నెంబర్లు పోర్టబిలిటీని ఉపయోగించుకుని బిఎస్ఎన్ఎల్ వైపుగా రూటు మారినట్లు తెలుస్తోంది. మరో 25 లక్షల మంది కొత్త బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ తో పాటు పలుచోట్ల కూడా బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులు విక్రమ కేంద్రాలనుంచి తెగ సందడి వాతావరణ కనిపిస్తోందట.. ముఖ్యంగా అపరిమిత కాల్స్ , డేట వంటివి 28 రోజులకు ప్రవేట్ టెలికాం సంస్థలు..189,199 చొప్పున ఉన్నప్పటికీ కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం కేవలం 108 రూపాయలకే ఇలాంటి ప్రయోజనాలను అందిస్తోంది. అలాగే 4g సేవలు బిఎస్ఎన్ఎల్ కి లేకపోవడంతో మైనస్ గా మారిందని తెలుపుతున్నారు. రాబోయే రోజుల్లో అటు 4G, 5g సేవలను కూడా బిఎస్ఎన్ఎల్ అందించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: