వాట్సాప్ సేఫ్టీ ఫీచర్... ఇక ఎలాంటి భయం అవసరం లేదు!

Suma Kallamadi
వాట్సాప్... గురించి జనాలకి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ యాంత్రిక యుగంలో స్మార్ట్ ఫోన్ వాడకం అనేది తప్పని సరి పరికరం అయిపోయింది. ఇక ఫోన్లు వాడే అందరూ మెసేజింగ్ యాప్ వాట్సాప్ను వాడడం విరివిగా మారింది. ఎంతలా అంటే? ఓ వందమంది దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందనుకుంటే అందులో దాదాపుగా 99 మంది ఈ వాట్సాప్ యాప్ ని కలిగి ఉంటారు. అంతలా ఈ యాప్ ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలోనే వాట్సాప్ గ్రూప్స్ పుట్టుకొచ్చాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స్కూల్, కాలేజీ, బిజినెస్ గ్రూప్స్ ఇలా చాలా వాట్సాప్ గ్రూపుల్లో మీరు కూడా ఓ సభ్యుడే అయి ఉంటారు కదా. అయితే ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యాడ్ చేసిన వాట్సాప్ గ్రూప్లో చేరి కొందరు మోసపోతున్నారు.
ఇపుడు ఇలాంటి మోసాలను అరికట్టేందుకు, యూజర్లు నేరుగా గ్రూప్లో యాడ్ చేసిన వ్యక్తి వివరాలను తెలుసుకునేందుకు వాట్సాప్ ఓ కొత్త సేఫ్టీ ఫీచర్ను యూజర్లకు తీసుకొచ్చింది. అవును... ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల భద్రతే ధ్యేయంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసినదే. ఈ క్రమంలోనే వారు తీసుకొచ్చిన ఈ ఫీచర్ మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వ్యక్తులు, లేదా అపరిచితులు మిమ్మల్ని ఇతర వాట్సాప్‌ గ్రూపులో యాడ్‌ చేసినప్పుడు, కీలకంగా పని చేయనుంది. ముఖ్యంగా యూజర్లను వాట్సాప్ గ్రూప్ స్కామ్స్ బారిన పడకుండా ఇది కాపాడగలదు.
గత కొన్ని సంవత్సరాలుగా లక్షలాది మంది వాట్సాప్ గ్రూప్ స్కామ్స్ బారినపడుతున్నారు. వాటిని అరికట్టేందుకు వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ను తీసుకొచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరికొద్ది రోజుల్లో యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ వలన మీరు వాట్సాప్‌ గ్రూప్‌లో జాయిన్‌ చేసిన వ్యక్తి పేరు, కాంటెక్స్ట్ తదితర వివరాలు చూపిస్తుంది. ఆ గ్రూప్‌ ఎప్పుడు, ఎవరు క్రియేట్‌ చేశారు? అనే విషయాలు కూడా తెలుపుతుంది. అంటే ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్ కాంటాక్ట్ లిస్ట్లో లేని వ్యక్తి పంపిన రిక్వెస్ట్ వివరాలు తెలుసుకోవచ్చని అర్ధం చేసుకోవాలి. దాంతో మీరు గ్రూప్లో ఉండాలా? తప్పుకోవాలా? అని యూజర్లు స్వతహాగా నిర్ణయం తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: