బుల్లి పిట్ట: హీరో నుంచి చౌక ధరకే.. లైసెన్స్ అవసరం లేని బైక్..!!

Divya
ఎలక్ట్రిక్ వాహనాల హవా మనదేశంలో కూడా రోజురోజుకి బాగా డిమాండ్ అయిపోయింది. పూర్తి పర్యావరణహితం కావడం అత్యాధునిక ఫీచర్స్ వల్ల మార్కెట్లో వీటి డిమాండ్ భారీగానే ఉన్నది. ప్రస్తుతం ఉన్న ఇంధన ధరలకు భయపడి ఎక్కువ మంది వీటినే వినియోగిస్తూ ఉన్నారు.. అయితే వీటి ధరలు కూడా సాధారణ బైక్స్ తో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రజలు వీటికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. మనదేశంలో బాగా అమ్ముడు పోయేటువంటి ఎలక్ట్రిక్ బైకులలో.. ఓలా, టీవీఎస్, హీరో, ఏథర్ ఇతరత్రా ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా హీరో  బ్రాండెడ్ నుంచి ఒక ఎలక్ట్రిక్ బైక్ తీసుకువచ్చింది. దీని పేరే హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్ ఎక్స్.. ఈ బైక్ అత్యధిక ఫీచర్స్ తో చాలా స్టైలిష్ డిజైన్తో చేశారు. పైగా దీని ధర మిగిలిన ఎలక్ట్రిక్ బైక్ తో పోలిస్తే సగం ధరకే లభిస్తుంది. ముఖ్యంగా ఈ స్కూటర్ డ్రైవ్ చేయడానికి ఎటువంటి లైసెన్స్ కూడా అవసరం లేదనీ హీరో సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ బైక్ సంబంధించి పూర్తి వివరాలు విషయానికి వస్తే..

హీరో ఎలక్ట్రిక్ బైక్.. లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎలాంటి లైసెన్స్ రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు..25 km నుంచి 30km  వేగంతో ప్రయాణిస్తుంది. ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్..51.2v/30Ah బ్యాటరీతో ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది.. ఈ బైక్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 110 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ కావడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. ఎలక్ట్రిక్ బైకు ఎల్ఈడి హెడ్లైట్, టేయిల్ లైట్, ఆకట్టుకొని డిజైన్తో ఉంటుంది.. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ .70 వేల రూపాయలు అయితే ప్రస్తుతం ఆఫర్ కింద రూ.60 వేల రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: