ఏంటి.. మనుషుల మూత్రంతో.. కరెంట్ తయారు చేయొచ్చా?
కొత్తగా ఎవరైనా ఇలాంటి ఆవిష్కరణను కనుగొన్నారు అంటే చాలు అది కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ప్రపంచనాప్తంగా ఇందుకు సంబంధించిన న్యూస్ పాకిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే ఇప్పుడు ఇలాంటి న్యూస్ ఒకటి వైరల్ గా మారిపోయింది. సాధారణంగా విద్యుత్ ను ఎలా తయారు చేస్తారు అని అడిగితే నీటి ద్వారా లేదా బొగ్గు ద్వారా తయారు చేస్తారు అని చెప్తారు ఎవరైనా. ఇక ఇటీవల కాలంలో సోలార్ పవర్ కారణంగా సూర్య రష్మితో కూడా విద్యుత్ తయారు చేయగలుగుతున్నారూ. కానీ మనిషి మూత్రంతో కూడా విద్యుత్ తయారు చేయవచ్చు అంటే నమ్ముతారా.
మనిషి మూత్రం తో విద్యుత్ తయారు చేయడం ఏంటి.. ఇది వినడానికి కొత్తగా ఉంది అనుకుంటున్నారు కదా. కానీ కేరళ లోని ఐఐటి పాలక్కడ్ లో పరిశోధకులు మాత్రం మూత్రం నుంచి విద్యుత్ తయారు చేశారు. మొదట ఎలక్ట్రో కెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్ ను తయారు చేశారు. అందులో మూత్రాన్ని నింపి ఎలక్ట్రో రసానిక చర్య ద్వారా కరెంటు ఉత్పత్తి చేశారు. దీంతో స్మార్ట్ఫోన్ల చార్జింగ్, లైట్ లను వెలిగించుకోవచ్చట. థియేటర్లు, షాపింగ్ మాల్స్ వద్ద మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్కువ విద్యుత్ ఉత్పత్తిని చేయవచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు.